మహిళలను అగౌరవపరచడం సిగ్గుచేటు
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:24 PM
మహిళలను అగౌరవపరుస్తూ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి మాట్లాడడం సిగ్గుచేటు అని యూత్ కాంగ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూ దన్‌రెడ్డి అన్నారు.
- యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి
- బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నిరసన
నారాయణపేట టౌన్/మక్తల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలను అగౌరవపరుస్తూ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి మాట్లాడడం సిగ్గుచేటు అని యూత్ కాంగ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూ దన్‌రెడ్డి అన్నారు. వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీని హేళన చేస్తూ రమేష్ బీదూరి మాట్లా డడంపై జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌర స్తాలో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చే పట్టారు. ఈ సందర్భంగా రమేష్ బీదూరికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. హిందూ సిద్ధాంతాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు మహిళ లను అగౌరవపర్చడం ఎంతవరకు సమంజసమ న్నారు. అంతకుముందు యంగ్ ఇండియా కీబో ల్ సీజన్-5 పోస్టర్‌లను స్థానిక సీవీఆర్ భవన్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు హరీశ్వర్‌రెడ్డి, వేణుగౌడ్, మహేష్‌రెడ్డి, భా స్కర్, సర్పరాజ్, యూసుఫ్‌తాజ్, తారక్, శ్రీను, ఆంజనేయులు, మంగు శ్రీను, విక్రమ్ ఉన్నారు.
అదేవిధంగా, మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేణు గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మ క్తల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవీందర్, ఎన్‌ఎస్‌యూఐ అఫ్రోజ్, నర్వ యూత్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, మాగనూరు మండల అధ్యక్షుడు ఆనం టద్, యువజన కాంగ్రెస్ అధ్య క్షుడు మహేష్‌కుమార్‌రెడ్డి, కృష్ణ మండల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 11:24 PM