ఐకమత్యానికి, భక్తికి కురువ కులస్తులు నిదర్శనం

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:19 PM

ఐకమత్యానికి, భక్తికి నిదర్శనం కురువ కులస్తులని ఎంపీ డీకే.అరుణ అన్నారు.

ఐకమత్యానికి, భక్తికి కురువ కులస్తులు నిదర్శనం
బీరప్పస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న ఎంపీ డీకే.అరుణ

- ఎంపీ డీకే.అరుణ

- మరికల్‌లో ప్రతిష్ఠాపన విగ్రహానికి ప్రత్యేక పూజలు

మరికల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఐకమత్యానికి, భక్తికి నిదర్శనం కురువ కులస్తులని ఎంపీ డీకే.అరుణ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మూడు రోజులుగా జరుగుతున్న హోమం, జలాఽధివాసంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి ఆదివారం ఎంపీ డీకే.అరుణ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సోమవారం జరిగే బండారు ఉత్సవంలో భాగంగా బీరప్ప స్వామి విగ్రహాలతో మాదాసీ కుర్వ కులస్తులు ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ఆలయంలో డీకే.అరుణ బీరప్ప విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీరప్పస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఉప సర్పంచ్‌ సీమ శివకుమార్‌తో పాటు, 20 మంది యువ కులు ఎంపీ అరుణ సమక్షంలో బీజేపీలో చేర గా ఆమె వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, సత్యయాదవ్‌, అధికార ప్రతినిఽధి చిన్న నర్సన్‌గౌడ్‌, పోలేమెని రమేష్‌, మహేందర్‌, నర్సిములు, దుబాయి రాములు, నారాయణ, కృష్ణయ్య తదితరులున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:19 PM