ఇంకిన నీరు
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:45 PM
యా సంగి సాగు రైతులకు చివరి వరకు సాగునీరు అందుతుందా? లేదా? అనే సందిగ్ధంతో ఉన్నారు. దినదినం జూరాల ప్రాజెక్టు జలాశయంలో నీటి ని ల్వలు తగ్గుతూ వస్తుండటంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు.

- జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు తగ్గుతున్న నీరు
- వారబందీ పద్ధతిలో 35 వేల ఎకరాలకు సాగు నీరు
- పంట చేతికి వచ్చే వరకు నీరు అందడం ప్రశ్నార్థకమేనా?
- కర్ణాటక ప్రభుత్వంపైనే ఆశలు
అమరచింత, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): యా సంగి సాగు రైతులకు చివరి వరకు సాగునీరు అందుతుందా? లేదా? అనే సందిగ్ధంతో ఉన్నారు. దినదినం జూరాల ప్రాజెక్టు జలాశయంలో నీటి ని ల్వలు తగ్గుతూ వస్తుండటంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు. ముందస్తు అంచ నాలతో అధికారులు వారబందీ పద్ధతి ద్వారా సా గు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వచ్చే వేసవిలో ఉమ్మడి జిల్లాలకు తాగునీటిని సైతం అందించే అంచనా ఉండటంతో యాసంగి రైతుల్లో ఆందోళన కాస్తా పెరుగుతోందని చెప్పవచ్చు.
20 వేల ఎకరాలకు నీరు
జలాశయంలో నీటి కొరతను దృష్టిలో ఉంచు కుని ఇన్‌టెక్ వెల్ ప్రధాన ఎడమ కాలువ 0.1 నుంచి రామన్‌పాడు రిజర్వాయర్ వరకు కేవలం 20వేల ఎకరాలకే సాగునీటి వార బందీ పద్ధతి ద్వారా విడుదల చేయాలని అధికా రులు నిర్ణయం తీసుకున్నారు. కుడి కాలువ కింద మరో 15వేల ఎకరాలకు, అనధికారికంగా మారో 10 వేల ఎకరాలలో రైతులు వరి సాగు చేసినట్లు తెలి సింది. మొత్తానికి 35 వేల ఎకరాలకు వారబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా సోమవారం నుంచి గురువారం వరకు నీటిని విడుదల చేసి శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిలిపి వేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి మట్టం
జూరాల ప్రాజెక్టులో దినదినం నీటి నిల్వ శాతం తగ్గుతూ వస్తున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1.78 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ప్రధాన కుడి కాలువ ద్వారా 430 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 640 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు అధికారులు విడుదల చేస్తున్నారు.
ఆందోళనలో రైతులు
ఒకవైపు అధికారులు ఎడమ కాలువ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీటిని వారబందీ పద్ధతిలో విడుదల చేస్తున్నప్పటికీ యాసంగి రైతుల్లో మాత్రం దినదినం ఆందోళన పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ శాతం తగ్గుతూ రావడమే రైతుల ఆందోళనకు కారణమని చెప్పవచ్చు. యాసంగి పంట చివరి వరకు సాగునీ టిని అందించి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వంపైనే ఆశలు
జూరాల ప్రాజెక్టులో దినదినం అడు గంటుతున్న నీటి శాతంతో ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. యాసంగి పంట కు సాగునీరు, వేసవిలో ఉమ్మడి మహ బూబ్ నగర్ జిల్లాలకు తాగునీటి విడుద లపై స్పందించిన జిల్లా మంత్రి ఎమ్మె ల్యేలు జూరాల ప్రాజెక్టులో ఖాళీ అవుతు న్న నీటిపై కదం తొక్కారు. గత వారం మంత్రితో పాటు జిల్లా ఎమ్మెల్యే ప్రత్యే కంగా కర్ణాటక వెళ్లి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిశారు. యాసంగి పం టకు చివరి వరకు నీటి విడుదలతో పా టు వేసవిలో నీటి అవసరాలపై వారికి వివరించా రు. 6 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని కోరారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలపై హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో యాసంగి రైతులు, ప్రజలు కర్ణాటక ప్రభుత్వం వదులుతున్న నీటిపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు.
నిల్వలు తగ్గుతున్న మాట వాస్తవమే..
ఈ విషయంపై జూరాల ప్రాజెక్టు అధికారి జుబే ర్ అహ్మద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు తగ్గుతున్న విషయం వాస్తవ మేనన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. ఎగువ నీటి విడుదల అయితే సమస్య ఉం డదన్నారు. ప్రాజెక్టులోని నీటిని వృధాగా పోకుండా చూసుకోవాలన్నారు. సమస్యను అదిగమిస్తామని వివరించారు.
నీటి నిల్వలు తగ్గుతున్న మాట వాస్తవమే..
ఈ విషయంపై జూరాల ప్రాజెక్టు అధికారి జుబేర్ అహ్మద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు తగ్గుతున్న విషయం వాస్తవమేనన్నారు. మంత్రితో పాటు ఎమ్మె ల్యేలు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. ఎగువ నుంచి నీటి విడుదల అయితే సమస్య ఉండదన్నారు. ప్రాజెక్టులోని నీటిని వృథాగా పోకుండా చూసుకోవాలన్నారు. సమస్యను అధిగమిస్తామని వివరించారు.
Updated Date - Feb 09 , 2025 | 11:45 PM