త్వరలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN, Publish Date - Apr 07 , 2025 | 11:14 PM

జిల్లాలో త్వరలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

త్వరలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రాంకిషన్‌, కాళోజి యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నందకుమార్‌రెడ్డి తదితరులు

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని అప్పక్‌పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమ వారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంకిషన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కా ర్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, కాళోజి యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నందకుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీలో ఏవైనా సమస్య లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. క లెక్టర్‌ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ప్రతీ గ్రామంలో వైద్య సేవలందాలని అన్నారు. వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నందకుమార్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట మెడికల్‌ కాలేజీ పురో గతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధు లను మంజూరు చేస్తామని, లైబ్రరీకి అవసరమైన 4 వేల పుస్తకాలను పంపిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త కె.పురుషోత్తంరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ దాసరి ప్రసాద్‌రావు, డాక్టర్‌ విజయ, సీనియర్‌ జర్నలిస్టు పంతంగి రాంబాబు, సామా జికవేత్త కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్రమోహన్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:14 PM