ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు అభినందనీయం

ABN, Publish Date - Mar 25 , 2025 | 11:43 PM

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్ర మాలు చేపట్టడంతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు అభినంద నీయమని జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు అభినందనీయం
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి

- జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి

కందనూలు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్ర మాలు చేపట్టడంతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు అభినంద నీయమని జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ మండలంలోని చందుబట్లలో ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఏడు రోజుల ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు ముగింపు కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి హాజరై మాట్లాడారు. ఎన్‌ఎ స్‌ఎస్‌ క్యాంపు ద్వారా క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అంజయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ వనిత, డీపీవో రేణయ్య ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి రామకృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:43 PM