డబ్లింగ్ పనుల భూసేకరణకు అభ్యంతరాల స్వీకరణ
ABN, Publish Date - Apr 03 , 2025 | 11:14 PM
మహబూబ్‌నగర్ నుంచి డోన్ రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ పనుల భూ సేకరణకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ముసాయిదాను విడుదల చేసింది. ఇప్పటికే మహబూబ్‌నగర్ వ రకు డబ్లింగ్ పనులు పూర్తికాగా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సేకరణకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

ముసాయిదా విడుదల చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ నుంచి డోన్ రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ పనుల భూ సేకరణకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ముసాయిదాను విడుదల చేసింది. ఇప్పటికే మహబూబ్‌నగర్ వ రకు డబ్లింగ్ పనులు పూర్తికాగా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సేకరణకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లో డబ్లింగ్ కోసం భూసేకరణ చేశారు. ఆయా సర్వే నెంబర్లలో భూములకు సంబంధించిన రైతుల జాబితా, కోల్పోతున్న భూముల వివరాలు సేకరించారు. భూసేకరణపై రైతులకు అభ్యంతరాలు ఉంటే 30 రోజులలో రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ మూడు మండలాల పరిధిలోని 8 గ్రామాలలో 415 మంది రైతులకు సంబంధించిన 28.5 ఎకరాల భూమిని డబ్లింగ్ పనులకు సేకరించనున్నారు. ఇప్పుడు వీటికే అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్‌లో 23 మంది రైతులకు సంబంధించిన 2.37 ఎకరాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జన్నప్పనల్లిలోని 9 మంది రైతుల 16 గుంటలు, కోడూర్‌లోని 27 మంది రైతుల 4.26 ఎకరాలు, కోటకదిరలోని 207 మంది రైతుల 6.20 ఎకరాలు, రాంచంద్రాపూర్‌లో ముగ్గురు రైతుల 30 గుంటలు, దేవరకద్ర మండలం వెంకటాయపల్లికి చెందిన ముగ్గురు రైతుల 10 గుంటలు, కౌకుంట్ల మండలం రేకులపల్లికి చెందిన 47 మంది రైతు 2.36 ఎకరాలు, పుట్లపల్లికి చెందిన 96 మంది రైతులకు చెందిన 9.27 ఎకరాల భూసేకరణపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
Updated Date - Apr 03 , 2025 | 11:14 PM