ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలి

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:29 PM

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అధికారులు మరింత సమర్థవంతంగా, సమన్వ యంతో పని చేయాల్సిన అవసరం ఉందని కలె క్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

ఆపరేషన్‌ ముస్కాన్‌ సమావేశంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అధికారులు మరింత సమర్థవంతంగా, సమన్వ యంతో పని చేయాల్సిన అవసరం ఉందని కలె క్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాలకార్మికులను, భిక్షాటన చేస్తు న్న వీధి బాలలను గుర్తించి ఆశ్రయం కల్పించి, తీర్చిదిద్దాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ము స్కాన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ ముస్కాన్‌ జనవరి 1నుంచి 31 వరకు నిర్వహిం చాలని, తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. జిల్లా లో వ్యాస్తంగా ఇటుక బట్టీలలో, భవన నిర్మాణాల పనుల్లో ఉన్న పిల్లలను గుర్తించి వారిని కాపాడాలని డీసీపీవోలను ఆదేశించారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు, డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ము ఖ్యంగా డ్రాప్‌ అవుట్‌లు గట్టు, కే.టిదొడ్డి, అయిజ రాజోలి మండలాల్లో ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో పాఠశాలకు రావడం మానేసిన 181 మంది డ్రాప్‌ అవుట్‌లను గుర్తిం చామని, వీరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పోషణ్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన న్యూట్రిషన్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మానవ వనరులు ఆరోగ్యం గా ఉంటే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, డీడబ్ల్యూవో సునంద, వ్యవసాయ అధికారి సక్రి య నాయక్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:29 PM