ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిలో శాశ్వత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN, Publish Date - Mar 26 , 2025 | 11:01 PM

ఉపాధి హామీలో శాశ్వత నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీవో నర్సింగరావు అన్నారు.

చెనుగోనిపల్లిలో ఉపాధి పనుల పరిశీలన

అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీవో ఇన్‌చార్జి నర్సింగరావు

గద్వాల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీలో శాశ్వత నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీవో నర్సింగరావు అన్నారు. బుధవా రం మండలంలోని చెనుగోనిపల్లిలో ఉపాధి హా మీ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై పలుసూచనలు చేశారు. గ్రామంలో ని నిర్మించిన కోళ్లషెడ్‌, పశువుల షెడ్‌, నేమ్‌ బోర్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా మా ట్లాడుతూ కోళ్లు, పశువుల షెడ్‌ల వంటి ప్రాజెక్టులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగించే వి అన్నారు. వీటి ద్వారా రైతులకు మేలు జరగడమే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతాయన్నారు. అనంతరం గోనుపాడులో చేపట్టిన ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ పనులను పరిశీలించారు. కూలీల సంఖ్య పెరగడంతో పాటు మస్టర్‌ ఎన్‌రోల్‌మెంట్‌ త్వరగా పూర్తి చేస్తే వేత న చెల్లింపులు త్వరగా జరుగుతాయని సిబ్బందికి సూచించారు. కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో విజయలలిత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:01 PM