ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్యశోధనా బాపు పాదయాత్ర విజయవంతం

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:52 PM

దేశంలో గాంధీజీ, అంబేడ్కర్‌ల ఆశయాల ను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మహాత్మాగాంధీ ముని మనువడు తుషార్‌ గాంధీ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తుషార్‌ గాంధీ, పక్కనే ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- గాంధీ, అంబేడ్కర్‌ ఆశయాలు కనుమరుగు చేస్తున్నారు

- గాంధీజీ ముని మనువడు తుషార్‌ గాంధీ

అచ్చంపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో గాంధీజీ, అంబేడ్కర్‌ల ఆశయాల ను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మహాత్మాగాంధీ ముని మనువడు తుషార్‌ గాంధీ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కన్యకా పర మేశ్వరి కల్యాణ మండపంలో రిటైర్డ్‌ డీఈవో విజయకుమార్‌ చేపట్టిన బాపు బాటలో సత్యశోధనా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి తుషార్‌ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆయనకు స్వాగతం పలికారు. అచ్చం పేటలోని అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి తుషార్‌ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో అంబేడ్కర్‌, గాంధీ ఆశయాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. నేటి తరం విద్యార్థుల్లో స్పూర్తి నింపేందుకు పాదయాత్ర చేసిన విజయకుమార్‌ను ఆయన అభినందించారు. నేటి తరం విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల ద్వారా నే కాకుం డా, పలు సందర్భాల్లో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీ కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తోందన్నారు. అచ్చంపేట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు తుషార్‌ గాంధీకి ఆహ్వానం పలికారు. మరోసారి తుషార్‌ గాంధీ నల్లమలను సందర్శించాలని, మహత్ముడి ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తా మన్నారు. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తాను 33 సంవత్సరాల పాటు వివిధ హోదా ల్లో ఉద్యోగం చేసినప్పుడు కలుగని అనుభూతి, సంతోషం వంద రోజుల్లో పొందానని తెలిపారు. నేటితరం యువత మత్తు, డ్రగ్స్‌ బారిన పడి జీవితాలను నాశనం చేసుకో రాదని, బాపు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విజయ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు, గాంధీ స్మారక నిధి జాతీయ కార్యదర్శి సంజయ్‌ సింఘ్‌, టిషాట్‌ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, గాంధీ స్మారక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 10:52 PM