నవీన్‌కుమార్ మృతిపై రెండో రోజు విచారణ
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:32 PM
ఇటీవల నెమలికంటి నవీన్‌కుమార్ మృతి జి ల్లాలో చర్చనీయంగా మారింది. మొదట నవీన్‌కుమార్, ట్రాన్స్‌జెండర్ కాలనీవాసులుగా, తర్వాత వారిద్దరు సన్నిహితంగా ఉన్నట్లు వా ర్తలు వచ్చాయి.

- ట్రాన్స్‌జెండర్ పల్లవి, తమ్ముడిని మరోమారు అదుపులోకి
- కాల్‌డేటాపై ఆరా?
గద్వాల క్రైం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నెమలికంటి నవీన్‌కుమార్ మృతి జి ల్లాలో చర్చనీయంగా మారింది. మొదట నవీన్‌కుమార్, ట్రాన్స్‌జెండర్ కాలనీవాసులుగా, తర్వాత వారిద్దరు సన్నిహితంగా ఉన్నట్లు వా ర్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా గతేడాది వి వాహం అయినట్లు వీడియోలు, ఫొటోలు సో షల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతవరకు బాగానే ఉన్నా.. కడుపునొప్పి వస్తేనే పు రుగుమందు తాగాల్సిన అవసరం ఏముం దనే కోణంలో, ఆ పురుగుమందు కూడా నవీన్ కుమార్ తండ్రి సమాధి పక్కనే తాగడం అనుమానాలకు తావిస్తుంది. రెండు రోజుల క్రితం చికిత్స పొందుతూ నవీన్‌కుమార్ మృ తి చెందడంతో తల్లి ఫిర్యాదు మేరకు ట్రాన్స్‌జెండర్ పల్లవి అలియాస్ రవి, ఆమె తమ్ముడు నరేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఇద్దరిని విచారించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ అ నంతరం శనివారం రాత్రి డీఎస్పీ కార్యాల యానికి తరలించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. తాజాగా ఆదివారం పల్లవి, తమ్ముడు నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ టంగుటూరి శ్రీను తెలిపా రు. ముఖ్యంగా నవీన్‌కుమార్, పల్లవి, నరేశ్ కాల్‌డేటాను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న ట్లు తెలిపారు. ఇంతకు నవీన్‌కుమార్‌ది హ త్యనా? ఆత్మహత్యనా? అనే విషయాలు పూ ర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
Updated Date - Feb 09 , 2025 | 11:33 PM