ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాజిక కేంద్రాలుగా పనిచేస్తున్న శిశుమందిరాలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:15 PM

శిశుమందిరాలు భావిభారత పౌరుల నిర్మాణ కేంద్రాలని, సమాజాన్ని తీర్చిదిద్దే గొప్ప సామాజిక కేంద్రా లుగా ఈ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): శిశుమందిరాలు భావిభారత పౌరుల నిర్మాణ కేంద్రాలని, సమాజాన్ని తీర్చిదిద్దే గొప్ప సామాజిక కేంద్రా లుగా ఈ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం పట్టణం లోని మినీ స్టేడియంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం పాలమూరు ఉమ్మడి జిల్లా పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదగడంతో పాటు నాయక త్వ లక్షణాలు, సమయపాలన నేర్చుకుంటారన్నారు. శిశుమందిర్‌ విభాగ్‌ కార్యదర్శి కుంటి ఎల్లప్ప మాట్లాడుతూ శిశుమందిరాల్లో చదువుకు న్న విద్యార్థులు వివిధ రంగాల్లో పనిచేస్తూ దేశ అభివృద్ధి, సమాజ ఉన్నతికి పనిచేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని శిశుమందిర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. అంతకుముందు పట్టణంలో క్రీడాకారులు నిర్వహిం చారు. కార్యక్రమంలో విశ్రాంత పీఈటీ గోపా లం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, శిశుమందిర్‌ పాఠశాల అధ్యక్షుడు రఘుప్రసన్నభట్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని పీఆర్టీయూ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. మక్తల్‌ మండలం నుంచి తొ గించి మద్దూరు మండలానికి బదిలీ చేసిన రెండు ఉపాధ్యాయ పోస్టులను మక్తల్‌కు కేటాయిం చాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు తిరు పతి, విదూర్‌, చంద్రశేఖర్‌లు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అనంతరం సంఘం క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు.

క్షీరలింగేశ్వర జాతర ఉత్సవాల పనులు వేగవంతం చేయాలి

కృష్ణ : ఈనెల 13 నుంచి 19 వరకు నిర్వహించనున్న క్షీరలింగేశ్వరస్వాముల జాతర ఉత్స వాల పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆయన ఆలయాన్ని పరిశీలించి, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పరిశుభ్రత, విద్యుత్‌ తదితర పనులు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే, మక్తల్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కృష్ణ మండలం ముడుమాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే డా.వాకిటి శ్రీహరి అందజేశారు.

గజరందొడ్డి గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి

మాగనూరు : తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ గజరందొడ్డి గ్రామస్థులు శనివారం మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో బసిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర సింహ, ఆశిరెడ్డి, చంద్రమ్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:15 PM