బీసీ కాలనీ దారి కోసం స్థల పరిశీలన
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:22 PM
తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలో ఉన్న బీసీ కాలనీకి దారి కోసం ఆర్డీవో రాంచందర్‌నాయక్ బుధవారం స్థల పరిశీలన చేశారు.
నర్వ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలో ఉన్న బీసీ కాలనీకి దారి కోసం ఆర్డీవో రాంచందర్‌నాయక్ బుధవారం స్థల పరిశీలన చేశారు. బీసీ కాలనీకి దారి వదలాలని ఇటీ వల ఎమ్మెల్యేతో కలిసి కాలనీవాసులు కలెక్టర్‌కు ఇచ్చిన వినతి మే రకు కలెక్టర్ ఆదేశానుసారం ఆర్డీ వో బుధవారం మండల కేంద్రానికి వచ్చారు. తహసీల్దార్ మల్‌రెడ్డి, ఆర్‌ఐ మల్లేష్, గ్రామస్థులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఏదో ఓ పక్క నుంచి కాలనీకి 20 ఫీట్ల దారి వదిలేందుకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని వారు పేర్కొన్నారు. కలెక్టర్ నిర్ణయం అనంతరం దారికి హద్దులు చూపుతామని ఆర్డీవో తెలిపారు, అనంతరం పెద్దకడ్మూర్ గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 242లోని ప్రభుత్వ భూమిలో నాలుగు ఎకరాల సోలార్ ప్లాంట్ కోసం స్థల పరి శీలన చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, జగన్‌మోహ న్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శరణప్ప, బీసం రవి ఉన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 11:22 PM