ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజ చైతన్యమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:29 PM

సమాజాన్ని చైతన్య పరచడమే ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్టీయ స్వయం సేవక్‌) లక్ష్యమని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, సరస్వతి విద్యాపీఠం పాలమూరు జిల్లా అద్యక్షుడు మోదేపల్లి కొండయ్య అన్నారు.

మాట్లాడుతున్న మోదేపల్లి కొండయ్య

భూత్పూర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : సమాజాన్ని చైతన్య పరచడమే ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్టీయ స్వయం సేవక్‌) లక్ష్యమని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, సరస్వతి విద్యాపీఠం పాలమూరు జిల్లా అద్యక్షుడు మోదేపల్లి కొండయ్య అన్నారు. మునిసిపాలిటీ పరిఽధిలోని అమిస్తాపూర్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ మార్చ్‌ (పఽథసంచాల్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొండయ్య ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య ఉద్దేశం గురించి వివరించారు. దేశంలో పలుమార్లు విపత్తులు జరిగినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకులు ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ స్వయం సేవకులు 1,76,000 లక్షల సేవలను అందిస్తున్నారని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని మాత్రమే కోరుకుంటుందన్నారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ యువకులు పథసంచాల్‌ నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యువకులు రాము, శ్యాంసుంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:29 PM