ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదన అభినందనీయం

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:46 PM

శాంతినగ ర్‌కు చెందిన కిరాణం వ్యాపారి రమేష్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించడం ఎం తో అభినందనీయమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

ఎస్పీ శ్రీనివాసరావు

పోలీస్‌ కార్యాలయానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు

వడ్డేపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శాంతినగ ర్‌కు చెందిన కిరాణం వ్యాపారి రమేష్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించడం ఎం తో అభినందనీయమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. దీంతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగిందని చెప్పారు. రమేష్‌ క్షేమంగా ఇంటికి చేర్చడంతో బాధిత కుటుంబ సభ్యులు, సన్నిహి తులు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపా రు. ఈ సందర్భంగా ఎస్పీ కిడ్నాప్‌ ఘటన వివ రాలను, సంప్రదించిన అంశాలను బాధితుడిని, ఆయన భార్యను అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఎస్పీ విలేకరులతో వివరాలు వెల్లడించా రు. కిడ్నాప్‌ అయిన భర్త నుంచి ఫోన్‌ రాగానే భార్య అనుమానాస్పదంగా భావించి వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని తెలిపా రు. శాంతినగర్‌ పట్టణానికి చెందిన కిరాణం షాపు యజమాని రమేష్‌బాబుకు, తాను అప్పు ఇచ్చిన నూగల రామయ్య బావమరిది శ్రీనివాస్‌ అంటూ ఈనెల 6న సోమవారం ఫోన్‌ చేశారు. మీకు మా బావ ఇవ్వాల్సిన నగదు, వడ్డీ ఇస్తా మని చెప్పారు. ఆ మాటలు నమ్మిన వ్యాపారి హైదరాబాద్‌కు వెళ్లి, అతనికి ఫోన్‌ చేయగా తాను రిజిస్ర్టేషన్‌ ఆఫీస్‌లో ఉన్నానని, నాగోల్‌ చౌరస్తాకు వెళితే అక్కడ మా తమ్ముడు ఉం టాడు, అతనిని అడిగి డబ్బులు తీసుకోవాలని చెప్పాడు. దీంతో రమేష్‌ ఆరంఘర్‌ చౌరస్తా నుంచి నాగోల్‌కు వెళ్లగా అక్కడకు ఒక వ్యక్తి వచ్చి తనను శ్రీనివాస్‌ పంపించాడు అని చెప్పి ఆదిత్యనగర్‌లో ఉన్న ఇంటి వద్దకు వచ్చి డబ్బు లు తీసుకుని వెళ్లమన్నాడని చెప్పి, ఆటోలో ఒక ఇంటికి తీసుకువెళ్లాడు. కాగా, అక్కడే నలుగురు వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి, బ్లాక్‌ స్వెట్టర్లు వేసుకుని ఉన్నవ్యక్తులు వ్యాపారి రమేష్‌ను గట్టిగా పట్టు కుని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లను తాడుతో కట్టి రూములో బంధించారు. మాకు రూ.50లక్షలు కావాలని, మీకు తెలిసిన వాళ్లతో తెప్పించు లేదంటే చంపేస్తామని బెదిరించారు. కాసేపటి తరువాత నీకు తెలిసిన మిత్రులతో రూ.10లక్షలు నగదు తెప్పించాలని, లేదంటే ట్రా న్స్‌ఫర్‌ (ఫోన్‌ పే)చేయించాలని చెప్పగా, రమేష్‌ తన స్నేహితులైన శివ నారాయణకు ఫోన్‌ చేసి నగదు తీసుకుని హైదరాబాద్‌కు రమ్మని చెప్పా డు. అనంతరం కిడ్నాపర్లు రమేష్‌ ఫోన్‌ నుంచి భార్యకు ఫోన్‌ చేయించి నాకు ఫిట్స్‌ వచ్చి కింద పడిపోయాను, డాక్టర్‌ వద్ద చూయించుకుని వ స్తానని చెప్పమని చెప్పగా అదేవిధంగా రమేష్‌ తన భార్యతో అలాగే చెప్పాడు. ఫోన్‌ మాట్లాడాక అనుమానం వచ్చిన ఆమె వెంటనే శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్‌ఐ సంతోష్‌ వెంటనే ఈవిషయాన్ని సీఐ టాటా బాబు, గద్వా ల డీఎస్పీ మొగులయ్య తెలియజేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రమేష్‌ ఫోన్‌ కాల్‌ సిగ్నల్‌ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో కిడ్నాప్‌నకు గురైన వ్యాపారి లోకేషన్‌ను గుర్తించారు. అనం తరం వాహనంలో ఇద్దరు కానిస్టేబుళ్ళను అక్క డకు పంపించి వ్యాపారిని బంధించిన ఇంటికి చేరారు. కాగా పోలీసులను చేసిన కిడ్నాపర్లు కొందరు పారిపోగా ఇద్దరినీ అదుపులోకి తీసుకు ని, కారులో బాధితుడిని తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Jan 08 , 2025 | 11:46 PM