చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:10 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని ఎస్‌ఐ అబ్దుల్ షుకూర్ వ్యాపారు లను హెచ్చరించారు.
- ఎస్‌ఐ అబ్దుల్ షుకూర్
ధరూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని ఎస్‌ఐ అబ్దుల్ షుకూర్ వ్యాపారు లను హెచ్చరించారు. శనివారం మండల కేం ద్రంలోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. నైలాన్, సింథటిక్ దారాల తో తయారు చేసిన చైనా మాంజాలతో ప ర్యావరణానికి విపత్తుగా మారడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకా శం ఉందని వివ రించారు. ఎవరికీ హానీ కల గని సాధారణ దారంతో గాలిపటాలను ఎగుర వేసుకో వాలని సూచించారు.
అలంపూరు: గాలి పటాలను ఎగుర వేసేందుకు వినియోగించే వాటిలో చైనా మాం జాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ వెంకటస్వామి హెచ్చరించారు. శనివారం అలంపూరు పట్టణ కేంద్రంలోని పలు కిరాణం షాపులను తనిఖీ చేపట్టారు. ఎస్‌ఐ మాట్లాడుతూ చైనా మాంజా వినియోగించ కుండా తనిఖీలు చేపడుతున్నామన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 11:10 PM