Share News

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:18 PM

నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని పాత కలెక్టర్‌ కార్యాల యం వద్ద బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి
బాబుజగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి

- జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించిన కలెక్టర్‌

- పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ, ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని పాత కలెక్టర్‌ కార్యాల యం వద్ద బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా షెడ్యూల్‌ కులాల అభి వృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌లు బాబుజగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమాన త్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని అన్నారు. బాబుజగ్జీవన్‌రామ్‌ దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావంతమైన నా యకుడు మాత్రమే కాకుండా నిస్వార్థ సేవకు, న్యాయ పోరాటానికి ప్రతీక అని ఆయన సేవలను గుర్తు చేశారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రామ్‌ జీవితం ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు. ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ మాట్లాడు తూ బాబుజగ్జీవన్‌రామ్‌ గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడని, ప్రజాప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి పీవీ.శ్రావణ్‌కుమార్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్‌ఐ జగన్‌, షెడ్యూల్‌ కులాల కార్పొరేషన్‌ ఈడీ రాంలాల్‌, ఏఎస్‌డబ్ల్యూవో శ్రీకర్‌ రెడ్డి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:18 PM