ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:48 PM

రాష్ట్రం లోనే ఉత్తమ జనరల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

గైనిక్‌ ఐసీయూని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌

- హెచ్‌డీఎస్‌ సమావేశంలో కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం), జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోనే ఉత్తమ జనరల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం నిర్వహణకు ముందు కలెక్టర్‌తో పాటు మ హబూబ్‌నగర్‌ ఎంపీ డి.కె.అరుణ, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా స్‌రెడ్డిలు కొత్తగా ఏర్పాటు చేసిన లేబర్‌ రూం ఐసీయూ, రేడియాలజి, ఫార్మసి విభాగాలతో పాటు ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలోని డ్రైనేజీ, ఎలక్ట్రికల్‌ పనులను పరిశీలించి నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. 10వేల లీటర్ల సామర్థ్యం ఉన్న పాత ఓవర్‌హెడ్‌ ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకును నిర్మించాలని మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లను తొలగించాలని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ రూంలు, షేరింగ్‌ రూంలకు రూ. 500, ఒక్కరే ఉండే రూంలకు రూ. 1000 నిర్ణయించా రు. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఆరుగురు గుండె డా క్టర్లు వారానికొకరు రెండు గంటల చొప్పున ఉచితంగా ఓపి చూసేందు కు ముందుకు రావాలని ఐఎంఏ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాంమోహన్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ సంక్రాంతి తర్వాత వచ్చి ఓపి చూసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, గ్రంథాలయ సం స్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, హెచ్‌డీఎస్‌ సభ్యుడు రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆసుపత్రికి అవసరమైన సోలార్‌ లైటింగ్‌ సిస్టమ్‌, అత్యవసర అంబులెన్సును మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నిరుపేదకు ఉచిత వైద్యం అందించే దశగా జ నరల్‌ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని, ఇందుకోసం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు అవసరమైనా ప్రతిపాదనలు రూపొందిస్తే తాను నిధులు తేవ డానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దీంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాలా వరకు పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయని, వారితో సమావే శాలు ఏర్పాటు చేయించి సీఎస్‌ఆర్‌ నిధులు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.

- తన నిధుల నుంచి ఆసుపత్రి అభివృద్ధి పనులకు గానూ, అత్య వసర పనుల నిమిత్తం రూ. 10 లక్షల నిధులు ఇస్తానని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు వె ళ్లాల్సిన పనిలేకుండా అన్ని రకాల వైద్యసేవలు జనరల్‌ ఆసుపత్రిలోనే అందేవిధంగా కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 11:48 PM