‘ఉగాది’ సందడి
ABN, Publish Date - Mar 29 , 2025 | 11:05 PM
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లతో శనివారం జోగుళాంబ గద్వాల పట్టణం సందడిగా మారింది.

జాతరను తలపించిన గద్వాల మార్కెట్ పరిసరాలు
గద్వాల టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లతో శనివారం జోగుళాంబ గద్వాల పట్టణం సందడిగా మారింది. నేడు విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా తోరణాలు కట్టేందుకు కావాల్సిన మామిడాకులు, బంతిపూలు కొనుగోలు చేసేవారితో మార్కె ట్ అంతా జాతరను తలపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉగాది పండుగ రోజు రైతులు కొత్తదుస్తులు ధరించి కాడెద్దులను పొలాల్లోకి తీసుకువెళ్లి పూజలు చేయడం, వానకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. దీం తో పండుగ సరకులు కొనేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణానికి రావడంతో సందడి... సందడిగా మారింది. దీంతో పాటు షడ్రుచుల పచ్చడి తయారు చేసేందుకు కావాల్సిన కిరాణ సరకులు కొనేవారితో దుకాణాలు కిటకిటలాడాయి.
Updated Date - Mar 29 , 2025 | 11:05 PM