ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సన్నబియ్యంలో కేంద్రం వాటానే అధికం

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:11 PM

పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సన్నబి య్యం వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటానే అధి కంగా ఉందని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.

- బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

అయిజ టౌన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సన్నబి య్యం వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటానే అధి కంగా ఉందని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం అ యిజలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు సన్నబియ్యం సేకరణకు కేటాయిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేసే సన్నబియ్యం లో ఖర్చుచేస్తున్న రూ.50లో దాదాపు రూ.40లు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రా ష్ట్ర ప్రభుత్వం జారీచేసే రేషన్‌కార్డులో ప్రధాని ఫొటోను ముద్రించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, శివారెడ్డి, లక్ష్మణ్‌గౌడు, నరసింహులు, రాజశేఖర్‌, వెంకటేష్‌, బెల్లం నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:11 PM