కన్నవారు మృతి.. నిస్సహాయస్థితి

ABN, Publish Date - Mar 24 , 2025 | 11:38 PM

తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయంగా మారిన ముగ్గురు అనాథ బాలలను ప్రభుత్వం ఆదుకో వాలని సామాజిక కార్యకర్త డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ కోరారు.

కన్నవారు మృతి.. నిస్సహాయస్థితి
బాలలకు పుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేస్తున్న ప్రేమ్‌కుమార్‌

- గార్లపాడులో అనాథలైన ముగ్గురు చిన్నారులు

మల్దకల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయంగా మారిన ముగ్గురు అనాథ బాలలను ప్రభుత్వం ఆదుకో వాలని సామాజిక కార్యకర్త డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ కోరారు. మల్దకల్‌ మండలం గార్లపాడుకు చెందిన బాలలను సోమవారం పరామర్శించిన ప్రేమ్‌కుమార్‌, వారికి పుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేశారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృత్యువాతపడగా, నిస్సహాయస్థితిలో ఉన్నారని, విద్యాభ్యాసం కొనసాగిస్తున్న బాలల స్థితిగతులను గుర్తించి, వారు గురుకులాల్లో చదువుకునేలా చర్యలు తీసుకొని కలెక్టర్‌ అండగా నిలవాలని కోరారు.

Updated Date - Mar 24 , 2025 | 11:38 PM