దుండగులను కఠినంగా శిక్షించాలి

ABN, Publish Date - Apr 02 , 2025 | 11:42 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండ లంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో సామూహిక హత్యాచా రానికి పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దుండగులను  కఠినంగా శిక్షించాలి
నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఎస్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండ లంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో సామూహిక హత్యాచా రానికి పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్ట కరమన్నారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా వారికి శిక్షపడేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచు కోవాలన్నారు. ప్రధాన దేవాలయాలు, ట్యాంక్‌బండ్‌ వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగిన విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులతోపాటు సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరు మానవతా దృక్పథంతో మహిళల రక్షణకు సహకరించాల్సినవసరం ఉందన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:42 PM