పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Apr 05 , 2025 | 11:13 PM
మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామంతో పాటు, ఊట్కూర్ మండలంలోని పులిమామిడి, నిడుగుర్తి గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు.

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- గ్రామాల్లో మొదలైన సన్నబియ్యం పంపిణీ
మక్తల్‌రూరల్/మక్తల్/నారాయణపేటరూరల్/మాగనూరు/మరికల్/కొత్తపల్లి/దామరగిద్ద, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామంతో పాటు, ఊట్కూర్ మండలంలోని పులిమామిడి, నిడుగుర్తి గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సం క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదల కోసమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీవో ర మేష్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, ఆనంద్ గౌడ్ తదితరులున్నారు.
అదేవిధంగా, పేట మండలం బొమ్మన్‌పాడ్, అమ్మిరెడ్డిపల్లి, అప్పక్‌పల్లి, చిన్నజట్రం, లక్ష్మీపూర్, బోయిన్‌పల్లి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని మార్కెట్ చైర్మన్ రాంపురం సదాశివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దొడ్డుబియ్యం తినలేక అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.గౌస్, రాంచందర్‌గౌడ్, జనార్దన్‌గౌడ్, విష్ణు, అశోక్, నగేశ్, వెంకటయ్య, మల్లేష్, రాములు, నరసింహ తదితరులున్నారు.
ఫ్లెక్సీలో మోదీ ఫొటో పెట్టాలి..
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వాగత ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని మండలంలోని బోయిన్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలు వాదనకు దిగారు. సన్నబియ్యం పంపిణీకి వచ్చిన నాయకులతో కార్యకర్తలు మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా సైతం ఉందని.. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ప్రధాని మోదీ ఫొటోను ఫ్లెక్సీలో లేకపోవడంపై తప్పుపట్టారు. గ్రామస్థులు సర్దిచెప్పడంతో కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి, వెళ్లిపోయారు.
అదేవిధంగా, మాగనూరు మండలం వర్కూ రు గ్రామంలోని రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ ప్రారంభించి, మాట్లాడారు. సన్న బియ్యాన్ని ప్రతీ లబ్ధిదారుడు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తిప్పయ్య, మారెప్ప, డీలర్ నరసింహ, వివిధ పార్టీల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మరికల్ మండలంలోని పసుపుల, పెద్దచింతకుంట గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీని సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. పసుపుల ఎంపీటీసీ మాజీ సభ్యురాలు విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ మాధవి రాజు, వీరన్న, రామన్‌గౌడ్, హరీష్, రామకృష్ణ, డీలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో శనివారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షుడు కొట్ల మహేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, అంజిరెడ్డి, ప్రశాంత్, రాఘవులు, బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు శివరెడ్డి, రవి, గ్రామ స్థులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలం కానుకుర్తిలో శనివారం సన్న బియ్యం పంపిణీని ఎంపీటీసీ మాజీ సభ్యు డు మొనపురం బస్వరాజు ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 11:13 PM