గిరిజన రైతుల పాదయాత్ర
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:28 PM
గిరిజన రైతులు తరతరాల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, భూ పట్టాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు గిరి జన పాదయాత్ర చేపట్టారు.
- భూ పట్టాల కోసం ఆందోళన
- ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు
ఖిల్లాఘణపురం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు తరతరాల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, భూ పట్టాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు గిరి జన పాదయాత్ర చేపట్టారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మం డలం లోని కర్నెతండా, మామిడిమాడ, వెనికి తండా, ముందరితం డా, ఆము దంబండ తండా, గార ్లబండ తండా, షాపూర్, మేడిబాయి తండా, బక్క తండా, బిజినేపల్లి మండలంలోని చిన్న పీరుతండా, భీముని తండా, మిట్యా తండా గిరిజన రైతులు ఈ పాదయ్రాతలో పా ల్గొన్నారు. శుక్ర వారం కర్నె తండాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లా డుతూ... గత 200 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేస్తున్న గిరిజ నులకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా గిరిజన బతుకులు మారకపోవడంతో వలస జీవనం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి మాడ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 369 నుంచి 414 వరకు సుమారు 463 ఎకరాల భూములను 153 కుటుంబాల వారు సాగు చేస్తున్నారన్నారు. కాస్తు కాలంలో తరతరాలుగా రాజులు, జమీందారుల పేరు మీద ఉన్నాయని గుర్తు చేశారు. సీలింగ్ యాక్టు వచ్చినా ఇప్పటి వరకు భూములను రెవెన్యూ అధికారులు గిరిజన రైతుల పేరుపై మార్పిడి చేయలేదని ఆరోపిం చారు. 1991 సంవత్సరం నుంచి గిరిజన రైతులు భూ పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని 2019లో వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి భూమిని సాగు చేసిన గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించారని 2020లో సంబంధిత దస్ర్తాలు ఆర్డీవో పరిధికి చేరినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి భూ పట్టాలు అందిం చాలని, లేనిపక్షంలో రైతులు నిరాహార దీక్షలు చేసి సెక్రటేరి యట్ ము ట్టడించే పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చ రించారు. భూ పట్టాల సాధన కమిటీ కన్వీనర్ సక్రు నాయక్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఆంజనే యులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, దొంతికుంట తండా మాజీ సర్పంచ్ పీనా నాయక్, భరత్ నాయక్, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 11:28 PM