ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భవిష్యత్తు తరాలకు ఆదర్శం వడ్డె ఓబన్న

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:15 PM

భవిష్యత్తు తరాలకు ఓబన్న వీరగాధను అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

వడ్డెరల గన్ను ఎత్తిపట్టిన ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌

పాలమూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : భవిష్యత్తు తరాలకు ఓబన్న వీరగాధను అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌పార్కు ఏరియాలో వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఓబన్న జయంతి సందర్భంగా సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఐదుగురు విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి పునాదిరాయి వేసిన వడ్డెర జాతి అభ్యున్నతికి అండగా ఉంటానన్నారు. మునిసిపాలిటీ నుంచి వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటుకు రూ.ఐదు లక్షలు అందించినట్లు తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ ముడాచైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌ అహ్మద్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వినోద్‌కుమార్‌, సంజీవ్‌ ముదిరాజు, సిరాస్‌ఖాద్రి, టంకర కృష్ణ, సామ్యూల్‌ దాసరి, వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:15 PM