మండలంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తాం
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:32 PM
మేడికొం డ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని మేడికొండ మండల సాధన సమితిసభ్యులు ఈశ్వర్, అయి జ అఖిలపక్ష కమిటీ సభ్యులు నాగర్‌దొడ్ది వెంకట్రాములు నినదించారు.

అయిజ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మేడికొం డ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని మేడికొండ మండల సాధన సమితిసభ్యులు ఈశ్వర్, అయి జ అఖిలపక్ష కమిటీ సభ్యులు నాగర్‌దొడ్ది వెంకట్రాములు నినదించారు. భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం అయిజ మండల పరిధిలోని మేడికొండ గ్రామపంచాయితీ ఆవరణలో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రత్యే క మండలాల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతోందని ఇందులో భాగంగానే పెద్దగ్రామం మేడికొండ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చే యాలని కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కలిసి కట్టుగా కృషి చేద్దామన్నారు. గ్రామస్థులతో కలిసి తీర్మానించుకున్నారు. గద్వాల జి ల్లా కేంద్రంగా చేయాల్సిన కార్యకలాపాలపై ప్ర త్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మండ ల ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు తిమ్మప్ప, దేవప్ప, రాముడు, బీచుపల్లి పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:32 PM