మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
ABN, Publish Date - Mar 12 , 2025 | 11:14 PM
మహిళలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్నిరంగాల్లో రాణించే వి ధంగా సమాజంలో ప్రతీ ఒక్కరు మహిళా సాధికారతకు తోడ్పడాలని కలెక్టర్ బీఎం సంతోష్ అ న్నారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ
గద్వాల న్యూటౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్నిరంగాల్లో రాణించే వి ధంగా సమాజంలో ప్రతీ ఒక్కరు మహిళా సాధికారతకు తోడ్పడాలని కలెక్టర్ బీఎం సంతోష్ అ న్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీని వాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, జిల్లాలో 30నుంచి 40మంది మహిళా అధికారులు వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో జిల్లా అధికారులుగా, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లుగా విధులను నిర్వహిస్తు న్నారని, రాజకీయంగా కూడా మహిళలు రాణించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఎం.పీ, ఎమ్మెల్యే కోటాలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎదిగితే సమా జం అభివృద్ధి చెందుతుందని, ప్రతీ ఒక్కరు మహిళా సాధికారతకు తోడ్పడాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల పాత్ర సమాజంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిందని, పురాణాలలో కూడా మహిళలకు ఎక్కు వ ప్రాధాన్యత ఉందన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించా యి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు, మహిళా ఉద్యోగినులకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు బహుమతు లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా సంక్షేమాధికారి సునంద, డీసీపీవో నర్సింహ, మహిళ అధికారులు ఉన్నారు.
Updated Date - Mar 12 , 2025 | 11:14 PM