మహిళా సాధికారత పథకాల విజయవంతానికి కృషి

ABN, Publish Date - Mar 27 , 2025 | 11:22 PM

మహిళా సాధికారత, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తు న్న పథకాలు జిల్లాలో వందశాతం విజయవం తం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆ దర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు.

మహిళా సాధికారత పథకాల విజయవంతానికి కృషి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : మహిళా సాధికారత, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తు న్న పథకాలు జిల్లాలో వందశాతం విజయవం తం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆ దర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురు వారం సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌, పంచా యతీ రాజ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క లెక్టర్లతో చర్చించి తగు సూచనలు చేశారు. వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఐకేపీ సభ్యుల కు అత్యధికంగా కొనుగోలు కేంద్రాలు కేటాయిం చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లో ఇందిరా మహిళా శక్తి బజారు ఏర్పాటు చే యాలన్నారు. నిరుపేద కుటుంబంలోని 57 సం వత్సరాల వయసు దాటిన వారికి ఒకరికి వృద్ధా ప్య పింఛన్‌ ఇవ్వాలన్నారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని వ్యవస్థాపకులుగా మార్చవచ్చన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:22 PM