యువకులు బాధ్యతాయుతంగా ఎదగాలి

ABN, Publish Date - Mar 12 , 2025 | 11:17 PM

సమా జంలో యువకులు బాధ్య తాయుతంగా ఎదగాలని వ నపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

యువకులు బాధ్యతాయుతంగా ఎదగాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి అర్బన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సమా జంలో యువకులు బాధ్య తాయుతంగా ఎదగాలని వ నపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ క ళాశాలలో నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో ని ర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌ 2025 కార్యక్రమానికి ఆ యన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, జీవితంలో తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. అంతేకాకుండా స మాజంలో స్ర్తీలతో పాటు కుటుంబ సభ్యులను ఇతరులను గౌరవించే తత్వాన్ని అలవర్చుకోవా లని తెలిపారు. అనంతరం సైన్స్‌ మేళాను పరిశీ లించి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అదే విధంగా యువతి యువకులకు నిర్వహిం చిన కవిత్వం, చిత్రలేఖనం, సైన్స్‌ మేళా, ఉ పన్యాస పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన ప లువురికి ప్రశంసా పత్రాలను తన చేతుల మీ దుగా అందజేశారు.

Updated Date - Mar 12 , 2025 | 11:17 PM