రైతులకు బోనస్ చెల్లించాలి : బీఆర్‌ఎస్
ABN , Publish Date - Feb 10 , 2025 | 01:00 AM
తుంగతుర్తి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రకటించిన విధంగా సన్నధాన్యం రెండు నెలలు పూర్తయినా ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదని బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.

తుంగతుర్తి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రకటించిన విధంగా సన్నధాన్యం రెండు నెలలు పూర్తయినా ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదని బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సన్న ఽధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెప్పి ఇప్పటివరకు సగానికి పైగా రైతులకు చెల్లించలేదని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే బూటకపు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేర న్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.