ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి పంటల నమోదు సర్వే

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:51 PM

క్షేత్ర స్థాయిలో పంటల సర్వేకు ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించిం ది. వానాకాలంలో మెట్ట పంటలతో పాటు వరి, ఇతర పంటలు కూడా ఉంటాయి. అయితే వానాకాలం ముగిసి యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యాక ప్రభుత్వం పంటల నమోదుకు నిర్ణయించడం విశేషం.

ఈ నెల 8 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం

ఉమ్మడి జిల్లాలోని 73 మండలా ల్లో కొనసాగనున్న సర్వే

ప్రతీ మండలంలో ఒక గ్రామం ఎంపిక

ఆయా గ్రామాల్లో 400 నుంచి 500 ఎకరాల్లో పంటల పరిశీలన

‘రైతు భరోసా’ కోసమేనా?

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): క్షేత్ర స్థాయిలో పంటల సర్వేకు ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించిం ది. వానాకాలంలో మెట్ట పంటలతో పాటు వరి, ఇతర పంటలు కూడా ఉంటాయి. అయితే వానాకాలం ముగిసి యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యాక ప్రభుత్వం పంటల నమోదుకు నిర్ణయించడం విశేషం. అసలు ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై అధికారులకు కూడా సమాచారం లేదు. పంటల నమోదును మాత్రం ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వర కు పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిం ది. సిబ్బంది సరిపడా లేకపోతే అదన పు సిబ్బందితోనైనా సర్వే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

గత ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరుతో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా, ఎకరాకు రూ.7,500 జమ చేస్తామని ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 14వ తేదీ నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ‘రైతు భరోసా’ పేరుతో రైతుల బ్యాంకు ఖాతా ల్లో నగదును జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరుణంలో ప్రారంభంకానున్న సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ‘రైతు భరోసా’పై ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రానప్పటికీ ఆంక్షలు లేకుండా ఎకరాలకు పరిమితి లేకుండా నగదు జమచేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఓ వైపు పంటల సర్వే చేయిస్తున్న ప్రభుత్వం మరో వైపు 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి ‘రైతు భరోసా’ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది.

73 మండలాల్లో ఒక్కో గ్రామం ఎంపిక

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని మొత్తం 73 గ్రామాలను ఇప్పటికే గుర్తించగా, శనివారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు పంటల నమోదు సర్వేను అధికారులు నిర్వహించనున్నారు. మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అధికారులు, ఆ గ్రామాల్లో 400 నుంచి 500 ఎకరాల వరకు పంటలను పరిశీలించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. 400 నుంచి 500 ఎకరాల మధ్యలో ఏ ఒక్క సర్వే నంబర్‌ మిస్‌ కాకుండా పంట నమోదు సర్వేను పూర్తిచేస్తారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఈ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వే బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులు చూడనుండగా, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను 400 నుంచి 500ఎకరాల మధ్యలో సర్వేనంబర్లు బ్రేక్‌ కాకుండా ఏ పంటలు వేశారనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి యాప్‌లో పకడ్బందీగా నమోదుచేయనున్నారు.

పూర్తిస్థాయి సర్వేకు సమయం లేకే

‘రైతు భరోసా’పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా మార్గదర్శకాలు విడుదలచేస్తేనే స్పష్టత వస్తుంది. 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని, వారు సాగుచేస్తున్న పంటల వివరాలు తెలుసుకునేందకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు పంటల సర్వేను పూర్తిస్థాయిలో కాకుండా పైలట్‌ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేయడం గమనార్హం. దీంతో ‘రైతుభరోసా’ కోసమే పంటల సర్వే చేస్తున్నారనే చర్చ సాగుతోంది. సంకాంత్రి పండుగ నుంచే రైతు భరోసా నగదు జమచేస్తామని చెబుతున్నందున పూర్తిస్థాయి సర్వే ఈ కొద్ది సమయంలో చేపట్టే అవకాశాలు లేకపోవడంతో ‘రైతు భరోసా’ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ఉందనే విషయం రైతులకు తెలియజేసేందుకే పైలెట్‌ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసినట్టు చర్చ నడుస్తోంది. పంటలు సాగుచేసిన భూముల సర్వే నెంబర్‌ వివరాలను గ్రామ సభల్లో కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన పెట్టింది. అదే సమయంలో పంటల సర్వేను చేపట్టనుండటంతో సాగులో లేని భూములకు ‘రైతు భరోసా’ ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐదు రోజుల్లో పంటల సర్వే: పి.శ్రవణ్‌కుమార్‌, నల్లగొండ జేడీఏ

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు పంటల సర్వేను చేపట్టి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తాం. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 400 నుంచి 500 ఎకరాల్లో సర్వే నిర్వహిస్తాం. ఆ ఎకరాల మధ్య ఏ ఒక్క సర్వే నెంబర్‌ కూడా బ్రేక్‌ చేయకుండా పంటలను పరిశీలిస్తాం. సిబ్బంది కొరత లేకుండా సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం ఐదు రోజుల్లో లక్ష్యం మేరకు సర్వే పూర్తి చేస్తాం.

Updated Date - Jan 03 , 2025 | 11:51 PM