రైతు సంక్షేమమే ధ్యేయం
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:59 PM
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరు సింగిల్‌విండో ఆధ్వర్యంలో సంఘం నిధులు రూ.30లక్షల తో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించి మా ట్లాడారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల
ఆలేరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరు సింగిల్‌విండో ఆధ్వర్యంలో సంఘం నిధులు రూ.30లక్షల తో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించి మా ట్లాడారు. రైతులకు ఎలాంటి సమస్య లు తలెత్తకుండా ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. ఆలే రు నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 120 చెరువులను నింపామన్నారు. రానున్న సంక్రాంతి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా అందించనుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సింగిల్‌విండో చైర్మన్ మొగుళ్లగాని మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురళీ, డైరెక్టర్లు కలిసి ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు జనగాం ఉపేందర్‌రెడ్డి, డైరెక్టర్లు విద్యాసాగర్‌రెడ్డి, గవ్వల నర్సింహులు, బీస కృష్ణరాజు, ఆరె మల్లేశం, సిద్ధులు, మారుపల్లి భిక్షపతి, లక్ష్మీ, సీఈవో ఇందూరి వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ గుత్తా శామంతారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, వ్యవసాయ శాఖ మండల అధికారి శ్రీనివాస్, బీఆర్‌ఎ్‌సనేత పుట్ట మల్లేశం, సంపత్, జూకంటి ఉప్యలయ్య, సంపత్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్‌రాజు, యాజాజ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు వెంకటస్వామి, ముదికొండ శ్రీకాంత్ ఆలేటి అనిల్, వనజరెడి, పాల్గొన్నారు.
మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయం
చదువుల తల్లి సావిత్రీబాయి పూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని బీర్ల అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతిని సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఆమె విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
Updated Date - Jan 03 , 2025 | 11:59 PM