ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటిని విడుదల చేయాలి

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:58 AM

శ్రీరాంసాగర్‌ రెండోదశ ఆయకట్టు కు 1,500 క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేసి ఉపకాల్వకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

కొమ్మాల గ్రామంలో శ్రీరాంసాగర్‌ ఉపకాల్వలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

అర్వపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : శ్రీరాంసాగర్‌ రెండోదశ ఆయకట్టు కు 1,500 క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేసి ఉపకాల్వకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన రైతులు వినూత్నం గా శ్రీరాంసాగర్‌ ఉపకాల్వలో కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల చివరి ఆయకట్టు భూములకు నీరు అందజేయాలని కోరారు.కాల్వలను వెంటనే మరమ్మతులు చేయాలని డి మాండ్‌ చేశారు. పంట పొలాలకు సాగు నీటిని అందజేసి రైతులను కాపాడాలని కోరారు. తూములు తీసి చెరువులను నింపాలన్నారు. కార్యక్రమంలో రైతులు శ్రీను, అలివేలు, శంకర్‌, జనార్దన, రాములు, ఉపేందర్‌, గంగరాజు, ఉప్పలయ్య,శ్రీధర్‌, రాకే్‌ష,లింగయ్య,గిరి, శ్రీకాంత, బద్రి, చందు పాల్గొన్నారు.

రెండే గ్రామాలకు నీరు...

పెనపహాడ్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : వారబందీ పద్ధతిలో విడుదలవుతున్న ఎస్సారెస్పీ నీరు ఎట్టకేలకు మంగళవారం పెనపహాడ్‌ మండలాని కి చేరుకున్నాయి. అయితే నీటి విడుదల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ధర్మాపురం నుంచి మేగ్యాతండా వరకు మాత్రమే నీరు చేరింది. ఆ తర్వాత ఉన్న ఆయకట్టు ఎనిమిది గ్రామాలకు నీటి సరఫరా అయ్యే అవకాశం కనిపించడం లేదు. జనవరి 1వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు వారబ ందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద మండలంలో ఎస్సారెస్పీ కాల్వ కింద 13,562 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వారబంధీ పద్ధతిలో నీటిని విడుదల చేయడంతో చివరి భూములకు సకాలంలో నీరు చేరలేదు. దీంతో నార్లు పోసుకుని దు క్కులు దున్నుకొని సిద్ధంగా ఉన్నారు.వారబందీ కారణంగా పోసుకున్న నార్ల న్నీ ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం ఎదురవుతున్న రైతాంగానికి నిరాశ ఎదురైంది. ఈ విషయమై ఎస్సారెస్పీ నీటి పారుదల సహాయ నిర్వహణ అ ధికారి లింగయ్యను వివరణకోరగా రబీలో వారబందీ నీరు ఇస్తామని ముం దే చెప్పాం. పైనుంచి గోదావరి నీరు రాకపోవడంతో చేసేది ఏమీలేదన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:58 AM