ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరణించినా జీవించు

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:44 PM

‘సుకవి జీవించే ప్రజల నాల్కలందు’ అన్నాడు మహాకవి జాషువా. పరోపకారం చేసిన మనిషి యొక్క మంచితనానికి అతడి మరణానంతరం కూడా ప్రజలో గుర్తింపు లభిస్తుందని రాశాడు.

కొండల్‌రెడ్డి దంపతులు మెడికల్‌ కళాశాలకు దేహదానం చేసేందుకు ఇచ్చిన అంగీకారపత్రం

‘సుకవి జీవించే ప్రజల నాల్కలందు’ అన్నాడు మహాకవి జాషువా. పరోపకారం చేసిన మనిషి యొక్క మంచితనానికి అతడి మరణానంతరం కూడా ప్రజలో గుర్తింపు లభిస్తుందని రాశాడు. అతను సమాజానికి చేసిన సేవ గురించి భవిష్యత తరాలు కూడా చెప్పుకుంటాయని కవి భావన. అయితే మనిషి మరణంతోనే జీవితం ముగిసిపోదు, మరో మనిషి జీవితంలో వెలుగులు నింపుతూ జీవించేలా ఉండొచ్చు అంటున్నారు అవయవదానానికి ముందుకు వచ్చిన దాతలు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

సమాజ శ్రేయస్సును కాంక్షించి దేహదానం, అవయవదానం గురించి ఆలోచించడం ద్వారా ఆర్తుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్న ఆలోచనలు బలపడుతున్నాయి. కుటుంబీకుల్లో ఎవరైనా నిర్జీవులైతే వారి అవయవాలు దానం చేసేందుకు ఇటీవల సామాజిక స్పృహతో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మరికొందరు తమ మరణానంతరం తమ దేహాన్ని దానం చేస్తూ అంగీకారపత్రం ఇస్తున్నారు. దీని ద్వారా మరణానంతర జీవితాన్ని పొందుతున్నారు. ఇది ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతోందని అంటున్నారు.

తోటి వారికి మరో ఉదయం

సహజంగా జన్మించిన జీవి అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే జీవిత చరమాంకం వరకు దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఆరోగ్యంగా జీవించగలగడం సాధ్యమవు తోంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదం కారణంగానో, అనారోగ్యకారణంగానో ఒక అవయవం పనిచేయకపోవడం, లేదా తొలగించడం వల్ల అతడి జీవన పరిస్థితులు మృగ్యమవుతాయి. ఆ వ్యక్తిపై ఆధారపడిన మిగతా కుటుంబసభ్యుల జీవనం భగ్నమయ్యే అవకాశం తలెత్తుతోంది. ఇది సమాజ మనుగడకు శ్రేయస్కరం కాదు. ఆధునిక వైద్యవిజ్జానం అభివృద్ధి చెంది సైన్స సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నప్పటికీ కృత్రిమ అవయవాలు శరీర బాహ్యఅవయవాలు(కాళ్లు, చేతులు) వరకే పరిమితమయ్యాయి. ఇవి కూడా సహజ అవయవాలలా స్పందన కలిగి ఉండటం లేదు. అవయవ మార్పిడి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోగుల జీవితాలకో ప్రయోజనం కలిగింది. అవయవ నష్టంతో బాధపడుతున్న వ్యక్తికి రెండో జీవిత అవకాశాన్ని అందిస్తున్నారు. దీంతో సమాజంలో అవయవ దానం ప్రాముఖ్యం పెరిగింది. కళ్లు, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగు, కాలేయం లాంటి 37 అవయవాలు దానం చేయడం ద్వారా రోగికి నూతనజీవితాన్ని ప్రసాదించవచ్చు.

సజీవ/ నిర్జీవ దాతలు

బతికుండగానే రోగికి ఉన్న అనుబంధం మేరకు అవయవదానం చేసేవారు ఉన్నారు. లేదా మరణానంతరం, లేదా బ్రెయినడెత రోగుల అవయవాలను సేకరించవచ్చు. ఏఎల్‌ఎ్‌స(ఆర్టిఫీషియల్‌ లైఫ్‌ సపోర్ట్‌) ఇంట్రావీనస్‌ ప్లూయిడ్స్‌, ఆక్సిజన అందించడం ద్వారా మరణం తరువాత 36-72 గంటలు అవయవాలు పనిచేస్తాయి.

అవయవదానం- దేహదానం చేయండి

ఎంతో విలువైన దేహాలను మట్టి పాలు, మంటపాలు చేయకుండా వాటిని దానం ఇవ్వడం వల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని ప్రచారం సాగిస్తున్నారు మిర్యాలగూడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కొండల్‌రెడ్డి(జేకేఆర్‌). ఆయన జనవిజ్జాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కరపత్రాల ద్వారా అవయవదానం, దేహదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సాంప్రదాయాల పేర మృతదేహాలను కాల్చడం, పూడ్చడం కంటే ప్రజల కోసం పనిచేసే వైద్య కళాశాలలకు దానంగా ఇవ్వడం వల్ల వైద్యవిద్యార్థులు మానవ శరీర నిర్మాణం గూర్చి తెలుసుకుని ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తారని వివరిస్తున్నారు. అవయవాలు పాడైన వారికి అవయవ మార్పిడి చేయడం వల్ల కొత్త జీవితాన్ని ఇవ్వగలమని మరణం తరువాత ఇది మరో జన్మలాంటిదని అన్ని సందర్భాలలోనూ ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్‌ కళాశాలకు దానం ఇవ్వడమే కాకుండా నిరక్షరాస్యురాలైన తన భార్య పూలమ్మను కూడా దేహదానం చేయడానికి అంగీకరింపజేశారు. ఈ మేరకు ఇరువురు అవయవదాన ప్రమోటర్స్‌ ఆర్గనైజేషన వారికి కాన్సెంట్‌ లెటర్‌(అంగీకారపత్రాన్ని) ఇచ్చారు.

మిర్యాలగూడలో అవయవదాతలు

మాజీ శాసనసభ్యులు నంద్యాల శ్రీనివాసరెడ్డి, మానవహక్కుల నేత సుబ్బారావు భార్య సత్యవతి, కుమారుడు శరత, రవీందర్‌రెడ్డి కుమారుడు అచ్యుత మల్లు స్వరాజ్యం, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్రి లింగారెడ్డి, చవ్వా రాంరెడ్డి. ఆర్వీ ప్రసాద్‌ ఇలా ఎందరో తమ శరీరాలను, అవయవాలను, కళ్లను దానం చేశారు.

అవయవదానంపై అవగాహన పెరుగుతోంది

ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఐదేళ్లలో 285 కళ్లు, నలుగురు బ్రెయినడెత వారి అవయవాలు, రెండు కిడ్నీ దానాలు, మెడికల్‌ కళాశాలకు మృతదేహాన్ని దానంగా ఇచ్చారు.

విజయ్‌భాస్కర్‌, అవయవ దానం సంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - Jan 02 , 2025 | 11:44 PM