ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రపంచ సుందరి

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:35 AM

ప్రపంచస్థాయి ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరీశుడి ఆలయాన్ని మిస్‌ వరల్డ్‌-2024 విజేత క్రిస్టినా పిస్జ్కోవా మంగళవారం దర్శించుకున్నారు. తిరువీధుల్లో అఖండ దీపారాధన చేసి కొబ్బరికాయ సమర్పించి సనాతన హిందూ ధర్మం, ఆలయ విశిష్టత, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రపంచ సుందరి

యాదగిరీశుడిని దర్శించుకున్న క్రిస్టినా పిస్జ్కోవా

యాదగిరిగుట్ట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరీశుడి ఆలయాన్ని మిస్‌ వరల్డ్‌-2024 విజేత క్రిస్టినా పిస్జ్కోవా మంగళవారం దర్శించుకున్నారు. తిరువీధుల్లో అఖండ దీపారాధన చేసి కొబ్బరికాయ సమర్పించి సనాతన హిందూ ధర్మం, ఆలయ విశిష్టత, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. హిందూ సంప్రదాయ చీరకట్టులో ఆలయం మొత్తం కలియతిరిగి ఇక్కడి శిల్పకళా సౌందర్యాన్ని ప్రశంసించారు. ఆమెకు ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఈవో భాస్కర్‌రావు అందజేశారు. ఆమె వెంట ఐఏఎస్‌ కొర్ర లక్ష్మి, ఆలయ ఏఈవోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రఘు, పర్యవేక్షకుడు రాజన్‌బాబు, ఎస్పీఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ కే.శేషగిరిరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:35 AM