మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ABN, Publish Date - Feb 25 , 2025 | 12:53 AM

మండల కేంద్రంలో మహాశివరాత్రి జాతర సందడి మొదలైంది.

మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మహాశివరాత్రి జాతర సందడి మొదలైంది. ఈ నెల 26వ తేదీ రాత్రి నిర్వహించే మహాశివరాత్రి జాతరకు మేళ్లచెర్వులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయం భు శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యు లు సిద్ధం చేశారు. గ్రామస్థులు ఇళ్లను శుభ్రం చేసుకుని, పండుగకు వచ్చే బంధువులు, స్నేహితుల కోసం రకరకాలు పిండి వంటలు తయా రు చేస్తున్నందున గ్రామంలో మొత్తం కమ్మటి వాసనలతో గుమగుమలాడుతోంది. గత ఏడాది జాతర వీడియోలను స్థానిక యువత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి ఈ ఏడాది జాతరకు హైప్‌ తీసుకువస్తున్నారు.

తుది దశకు ఏర్పాట్లు..

మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్ల నిర్మాణం పూర్తైయింది. ఎద్దుల పందెల ప్రాంతం, కబడ్డీ కోర్టులు, అన్నదాన నిర్మాణ కేంద్రం, రంగుల రా ట్నం నిర్మాణాలు, ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి.

మొదలైన ప్రభల ఏర్పాటు

మహాశివరాత్రి జాతర సందర్భంగా మంగళవారం పుర వీఽధుల్లో విద్యుత ప్రభలు ఏర్పాటు చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ డానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం జాతరకు ఒకరోజు ముందు గ్రామానికి విద్యుత ప్రభలు వచ్చేవి. ఈ ఏడాది జాతరకు రెండు రోజులు ముందుగానే గ్రామంలోకి వచ్చి ప్రభల నిర్మాణం చేపట్టడం తో గ్రామంలో మహాశివరాత్రి సందడి మొదలైంది

Updated Date - Feb 25 , 2025 | 12:53 AM