Share News

శ్రామికవర్గ రాజ్యస్థాపనే లక్ష్యం

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:39 PM

దేశంలో శ్రామికవర్గ రాజ్య స్థాపనే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన భవనలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

శ్రామికవర్గ రాజ్యస్థాపనే లక్ష్యం
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ

సూర్యాపేట టౌన, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):దేశంలో శ్రామికవర్గ రాజ్య స్థాపనే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన భవనలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయపోరాటాలు బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా జ్యోత్యిరావుపూలే జయంతి రోజైన ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయి వరకు అధ్యయన యాత్రలు చేపడుతున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నా టి నుంచి మనువాద పాలన సాగిస్తూ, కుల, మత, మహిళ, దళిత, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూ ములను కార్పోరేట్‌ శక్తులకు కట్టపెట్టేందుకు చర్యలు తీసుకుందని ఆరోపించారు. హెచసీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీల పాత్ర ఉందని ప్రచారం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఎం దుకు స్పందించడం లేదో ప్రజలకు తెలపాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, నాగారపు పాండు, ఏకలక్ష్మీ,కోట రమేష్‌, వెంకట్‌రెడ్డి, శ్రీకాంతవర్మ, పులుసు సత్యం, సైదు లు, హుసెన, యాదగిరి, శ్రీను, నర్సయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:39 PM