జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు

ABN, Publish Date - Mar 02 , 2025 | 04:50 AM

ఆలంపూర్‌ జోగులాంబ ఆలయ కార్యనిర్వాహక అధికారిపై ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా నాయకులు విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు
  • ఆదాయం పక్కదారి పట్టిస్తున్నారని ఎన్‌ఎ్‌సయూఐ ఆరోపణ

హైదరాబాద్‌, మార్చి1(ఆంధ్రజ్యోతి): ఆలంపూర్‌ జోగులాంబ ఆలయ కార్యనిర్వాహక అధికారిపై ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా నాయకులు విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈవో పురేందర్‌.. సుదీర్ఘకాలంగా ఒక దగ్గరే విధులు నిర్వహించడంతోపాటు, ఆలయ ఆదాయం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తు హైదరాబాద్‌లోని విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సరైన ఆడిట్‌ నిర్వహించడం లేదని, లెక్కలు బహిర్గతం చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉత్సవాల్లోనూ అక్రమాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 04:50 AM