అడ్డగింతలు, అరెస్టులు, ఆందోళనలు
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:00 AM
సీఎం రేవంత్‌రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృ ష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రతిగా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిచేసిన ఘటన నేపథ్యంలో రెండోరోజు ఆదివారం జిల్లాలో ఉద్రిక్తత కొనసాగింది
భువనగిరి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృ ష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రతిగా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిచేసిన ఘటన నేపథ్యంలో రెండోరోజు ఆదివారం జిల్లాలో ఉద్రిక్తత కొనసాగింది. దాడిని ఖండిస్తూ జిల్లాకేంద్రం భువనగిరిలో బీఆర్‌ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యూహ ప్రతి వ్యూహాలు, పోలీసుల భారీ భద్రతా, భారీ కేడింగ్స్, రహదారులపై ప్రజల రాకపోకలపై పోలీసుల ఆంక్షలతో ఒక రకంగా జిల్లాకేంద్రం పోలీసు వలయాన్ని తలపించింది. ఉమ్మడి జిల్లాలోని మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటున్నారని కార్యకర్తలు మహాధర్నాకు తరలి రావాలని ఆ పార్టీ నాయకులు సమాచారం చేరవేశారు. వినాయక చౌరస్తా వద్ద ధర్నాకు అనుమతి లేదని శనివారం అర్థరాత్రి నుంచే జిల్లాఅంతటా బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు, అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పట్టణ ప్రధాన రహదారులైన నల్లగొండ, వరంగల్, జగదేవ్‌పూర్ రోడ్డు, బైపాస్ రోడ్డుతో పాటు పట్టణంలోని అన్ని చౌరస్తాలు, ప్రధాన అంతర్గత రహదారులపై ఆదివారం పికెటింగ్ ఏర్పాటు చేశారు. డీసీపీ ఎం. రాజేష్‌చంద్ర, అడిషనల్ డీసీపీలు లక్ష్మీనారాయణ, వినోద్, ఏసీపీ కె. రాహుల్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ బందోబస్తును పర్యవేక్షించారు.
ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలు
ఉదయం నుంచి పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అనుచరులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మద్య వాగ్వాదం జరిగింది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి కాలికి గాయమైం ది. అదేసమయంలో స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించే ందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులతో వచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నివాళులర్పించి వెనుదిరిగిన వెంటనే బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు. మిగతా వారిని జిల్లాలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం కంచర్ల రామకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఎంను దూషించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు, బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి చేసిన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్ యూఐ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
తప్పంతా బీఆర్‌ఎస్ నాయకులదే : ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం వెనుక బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి పట్ల చేసిన తీవ్ర వ్యాఖ్యలే కారణమని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగి రిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగిల్ విండో ఎన్నికల్లో కూడా సక్రమంగా గెలువని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తన స్థాయికి మించి సీఎంపై వ్యాఖ్యలు చేశారని, దీంతో సహించలేని తమ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లగా ఆ పార్టీ నాయకులు మరోమారు రెచ్చగొట్టేలా మాట్లాడారని దీంతో సమన్వయం కోల్పోయిన ఒకరిద్దరు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఏ ఉద్యమం చేయకుండా, ఏ పార్టీ జెండా పట్టకు ండా ఎమ్మెల్యేగా గెలిచి పదేళ్ల పాటు పదవిని అనుభవించిన పైళ్ల శేఖ ర్‌రెడ్డి మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు దూరంగా వెళ్లిపోయారని దీంతో కనుమరుగవుతున్నట్లు భయపడి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కాం గ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడించి ప్రజల్లో ఉనికి పొం దేందుకు చేసిన కుట్ర ఫలితమే ఈ పరిణామాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలోనే నయీం అరాచకాలు కొనసాగాయని నేటికీ ఆ ముఠాకు చెందిన పలువురు భువనగిరి మునిసిపల్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లుగా, ఆ పార్టీ నాయకులుగా ఉన్నారని ఆరోపించారు. శాంతి భద్రతల పరిర క్షణకు, నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను అయో మయానికి గురి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల భూ కబ్జాలను బహిర్గతం చేస్తామని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెం కటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ. అవేజ్ చిస్తీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్ సభ్యుడు తంగెళ్లపల్లి రవి కుమార్, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 01:00 AM