పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:34 AM
జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో పాటు అధికారు లపై దౌర్జన్యం చేసిన హుజూరాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేసి మరే ఎ న్నికలో పోటీ చేయకుండాఅనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు.
కోరుట్ల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో పాటు అధికారు లపై దౌర్జన్యం చేసిన హుజూరాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేసి మరే ఎ న్నికలో పోటీ చేయకుండాఅనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోమవారం పట్టణంలోని జువ్వాడి భవ నంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై దౌ ర్ణన్యం చేసినటువంటి కౌళిక్ రెడ్డిపై శాసన సభ స్పీక ర్‌కు వినతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, కొంతం రా జం, ఎంఏ నహీం, వెంకటేష్, మహిపాల్ రెడ్డి, రహ మాన్, తెడ్డు విజయ్ షకీల్ పాల్గొన్నారు.
రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాయికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి రవీందర్‌రావు అన్నారు. రాయిక ల్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. రాయికల్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ మోర హన్మాండ్లు, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫకౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాయిక ల్ పట్టణ, మండల బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ అ ధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, మండల అధ్య క్షుడు బర్కం మల్లేష్, రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
కథలాపూర్ : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యా ఖ్యలను ఖండిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారా యణరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగ రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీం పేర్కొన్నారు. వెంటనే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు క్ష మాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లకొండ లింగం గౌడ్, న్యావనంది శేఖర్, శ్రీహరి ఉన్నారు.
Updated Date - Jan 14 , 2025 | 01:34 AM