Share News

PM Modi: మీ కుటుంబంలో అందరూ డాక్టర్లేనా?

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:44 AM

మీ కుటుంబంలో అందరూ డాక్టర్లేనా?’ అని ప్రధాని నరేంద్ర మోదీ.. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావును సరదాగా ప్రశ్నించారు. గురువారం పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో రఘునందన్‌రావు కుటుంబసభ్యులతో మోదీని కలుసుకున్నారు.

PM Modi: మీ కుటుంబంలో అందరూ డాక్టర్లేనా?

  • ఎంపీ రఘునందన్‌కు ప్రధాని సరదా ప్రశ్న

  • మోదీతో రఘునందన్‌ కుటుంబం భేటీ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ‘మీ కుటుంబంలో అందరూ డాక్టర్లేనా?’ అని ప్రధాని నరేంద్ర మోదీ.. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావును సరదాగా ప్రశ్నించారు. గురువారం పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో రఘునందన్‌రావు కుటుంబసభ్యులతో మోదీని కలుసుకున్నారు. రఘునందన్‌ సతీమణి మంజుల, కూతురు డాక్టర్‌ సింధు, అల్లుడు డాక్టర్‌ శ్రవణ్‌తేజ, మనువరాళ్లు ఖనిష్క శిశిర, చైత్ర అరాత్రికతో కలిసి రఘునందన్‌ మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్‌ మనుమరాళ్లకు మోదీ చాక్లెట్‌లు ఇవ్వగా, చిన్న మనుమరాలు మోదీకి చాక్లెట్‌ తినిపించారు. పెద్ద మనుమరాలు సున్నితం.. చిన్న మనుమరాలు నాటీ.. అని మోదీ నవ్వుతూ అన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 04:44 AM