కుల, చేతి వృత్తులకు పీఎం విశ్వకర్మ
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:34 PM
వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ‘‘విశ్వకర్మ యోజన’’ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎటువంటి షూరిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ విధానం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తుంది. లబ్ధిదారుని వృత్తిని ఆధారంగా చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా వృత్తులో శిక్షణ ఇచ్చి మరీ రుణం అందజేస్తుంది.
ఉపాధి కల్పిస్తున్న పథకం
రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు తక్షణ సహాయం
రూ 5శాతం వడ్డీతో రుణం..
కులంతో సంబంధం లేకుండా పథకం అమలు
కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో వర్తింపు
భూపాలపల్లిటౌన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ‘‘విశ్వకర్మ యోజన’’ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎటువంటి షూరిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ విధానం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తుంది. లబ్ధిదారుని వృత్తిని ఆధారంగా చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా వృత్తులో శిక్షణ ఇచ్చి మరీ రుణం అందజేస్తుంది. దీంతో వారు ఉపాధి పొందవచ్చని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. 4 సంవత్సరాలకు 5శాతం వడ్డీరేటుతో ప్రతి లబ్ధిదారునికి రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం అందించనున్నారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం..
ఈ పథకం ముఖ్య ఉద్దేశం వృత్తి నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. దీనినే పీఎం విశ్వకర్మ యోజన లేదా విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అని కూడా పిలుస్తారు. ఈ పథకం ద్వారా రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ రుణం అందించడానికి ఎలాంటి ఆంక్షలు లేకుడా లబ్ధిదారుడి ఖాతాలోకి నేరుగా వెళ్లే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తిగా మినిస్ర్టీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ చే రూపొందించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది మార్కెట్ లింకేజ్ సపోర్ట్, స్కిల్ ట్రైనింగ్, నిర్ధిష్ట ట్రేడ్‌లలో నిమగ్నమైన చేతి వృత్తుల వారికి, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి కేటాయించబడిన స్కీం. దరఖాస్తు అనంతరం దృవీకరణ జరిగాక వారు విశ్వకర్మలుగా గుర్తించబడి రుణం అందుకుంటారని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని 2023 సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
అతి తక్కువ వడ్డీ..
ఈ పథకాన్ని సద్వి నియోగం చేసుకునే వారికి ప్రభుత్వం 1వ విడ తగా రూ.1లక్ష చెల్లిస్తుంది. దీనికి వడ్డీ రేటు 18నెలల్లో 5శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. అలాగే రెండవ విడతగా రూ.2లక్షల వరకు ఇస్తుంది. ఈ డబ్బులు 30నెలల వాయి దాలో చెల్లించవచ్చు. దీని కి కూడా 5 శాతం వడ్డీనే తీసుకుంటుంది. ఇలా విడతల వారీ గా రూ.3లక్షల వరకు రుణం తీసుకుని నాలుగే ళ్లలో కేవలం 5 శాతం వడ్డీ మాత్రమే చెల్లిం చాల్సి ఉంటుంది. పైగా స్కిల్ అప్ గ్రేడే షన్, టూల్‌కిట్ ఇన్ సెంటివ్, క్రెడిట్ సపో ర్ట్, మార్కెటింగ్ సపోర్ట్, డిజిటల్ లావాదే వీలకు ప్రోత్సాహం, పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడీ కార్డు అందజేస్తుంది. మొదటగా వారం కోజులు శిక్షణ ఇచ్చి అనంతరం 15రోజుల పాటు అధునాతన శిక్షణ కూడా ఇస్తుంది. ఈ శిక్షణా కాలంలో రోజుకు రూ.500 కూడా చె ల్లిస్తుంది. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేసి రుణం వారి ఖాతాల్లోకి జమచేస్తుంది.
దరఖాస్తు విధానం ఇలా..
చెక్క ఆధారిత పరిశ్రమ కోసం పనిచేసే సుతారి(కార్పెంటర్/ బధాయి), ఇనుము, మెటల్‌బేస్డ్, స్టోన్ బేస్డ్ వాటి కోసం పనిచేసే కవచుడు, కమ్మరి, హామర్, టూల్‌కిట్ మేకర్, తాళం చేసేవారు, శిల్పి, స్టోన్ బ్రేకర్, అలాగే గోల్డ్ స్మిత్, చెప్పులు కుట్టేవారు, తట్టలు, బుట్టలు అల్లేవారు, బార్భర్, గార్లాండ్ మేకర్, వాషర్‌మెన్ (దోభీ), దర్జీ, ఫిషింగ్ నెట్ మేకర్, కొయిర్‌నేత తదితర వాటిలో నైపుణ్యం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వీటితో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్‌కార్డు, మొబైల్‌నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, రేషన్‌కార్డు కలిగి ఉండాలి.
ఎవరు అర్హులు?
ఈ రుణం తీసుకోవడానికి 18 ఏళ్ల వయస్సు పైబడిన వారెవరైనా అర్హులే.. అలాగే దరఖాస్తుదారుడు గత ఐదేళ్లలో స్వయం ఉపాధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రుణం పొంది ఉండకూడదు. ఐదేళ్లలో తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించి ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు. ఈ పథకం రిజిస్ర్టేషన్, ప్రయోజనాలు కుటుంబంలోని ఒక సభ్యునికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. దీని కోసం దరఖాస్తుదారుడు కామన్ సర్వీస్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
3,547 దరఖాస్తులు వచ్చాయి..
- సిద్ధార్థ్, పరిశ్రమల శాఖ అధికారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఇప్పటివ రకు తమకు 3547 దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యో గులను కేంద్ర ప్రభత్వం ప్రోత్సహిస్తుంది. ఇంకా వేలాది మందికి అవకాశం ఉంది. ఉత్సాహం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని సీఎస్‌సీ సెంటర్‌ను సంప్రదించాలి.
Updated Date - Jan 11 , 2025 | 11:34 PM