ధరలు దడ..దడ
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:52 PM
నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. మూడు నెలల కాలంలో సరుకుల ధరలు 20 నుంచి 30 శాతానికి పెరిగాయి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునేలా పరిస్థితులు మారాయి. ఏ వస్తువు ధర చూసినా సామాన్యుడి గుండె ఆగినంత పనవుతుంది. పప్పులు నిప్పుల్లా వేగుతున్నాయి.
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..
పండుగ వేళ పస్తులుండాల్సిందే అంటున్న జనం
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తప్పని తిప్పలు
రఘునాథపల్లి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. మూడు నెలల కాలంలో సరుకుల ధరలు 20 నుంచి 30 శాతానికి పెరిగాయి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునేలా పరిస్థితులు మారాయి. ఏ వస్తువు ధర చూసినా సామాన్యుడి గుండె ఆగినంత పనవుతుంది. పప్పులు నిప్పుల్లా వేగుతున్నాయి. ఎల్లిగడ్డ ధర ఘాటెక్కింది. కూరగాయలు సగటు జీవిని గాయపరుస్తున్నాయి.వంట గ్యాస్ సంగతైతే సరేసరి..ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు సకినాలు కరకరలాడే పరిస్థితులు కన్పించడం లేదు.పిండి వంటల వాసనలు ఘుమఘుమలాడేలా లేవు. ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యుడు పండుగ సీజన్‌లో కూడా ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదని జనం అందోళన చెందుతున్నారు.
నింగినంటిన నిత్యావసర సరకుల ధరలు..
ఏ వస్తువును ముట్టుకున్న ధరలు భగ్గుమంటున్నాయి. సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన సామాన్యుల గుండెలు గుబేలుమంటున్నాయి. పెరిగిన వంట సరుకుల ధరలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దోసెడు డబ్బులు పోసినా గుప్పెడు సరుకులు రావడం లేదు. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు నిరుపేదల పరిస్థితి. పండుగ రోజు కాసిన్ని పిండి వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తినే భాగ్యానికి కూడా సామాన్యుడు నోచుకోలేక పోతున్నాడు. దరలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ పేదల బతుకుల్లో ఇక కాంతినేం నింపుతుంది.
పప్పులు నిప్పులు.. నూనెలు సలసల..
పండుగ పూట నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండి వంటలు చేసుకోవడానికి పప్పులే ముఖ్యం..ఏ పప్పు ముట్టుకున్నా వాటి ధరలు నిప్పుల్లా కాలుతున్నాయి. పిండి వంటలతో పాటు వివిధ రకాల కూరలలో విధిగా వాడే వెల్లుల్లి ధరల ఘాటు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అవసరమైన శెనగ పప్పు, కంది పప్పు, మినప పప్పు, పల్లీలు, గోదుమ పిండి, బెల్లం, నువ్వులు, మంచి నూనెల ధరలతో పాటు వెల్లుల్లి ధరలు పెరిగాయి. శెనగ పప్పు కిలోకు రూ.100, కంది పప్పు రూ.150, మినప పప్పు రూ.130, పెసర పప్పు రూ.120, వెల్లుల్లి కిలో రూ.310, పల్లీలు రూ.120, నువ్వులు కిలో రూ.180, బెల్లం రూ.80, గోదుమ పిండి రూ.50 ధర పలుకు తుంది. మూడు నెలల క్రితం పామాయిల్ కిలో ప్యాకెట్‌కు రూ.95 ఉండగా ప్రస్తుతం రూ.135, సన్‌ఫ్లవర్ రూ.115 నుండి రూ.145, వేరుశెనగ రూ.155 నుంచి రూ.180, రైస్ బ్రాండ్ రూ.140 నుండి రూ.180 వరకు పెరిగాయి.
పలహారం...మహాభారం
సంక్రాంతి అంటే పిండి వంటల పండుగే..పండుగ రోజు సామాన్యుడు కుటుంబ సభ్యుల తో కలిసి ఏడాదిలో ఒక్కసారైనా కాసిన్ని పిండి వంటలు చేసుకోవాల నుకుం టాడు. కానీ మండుతున్న ధరల ను చూసి ఆ సాహసం చేయలేక పోతున్నాడు. పలహారం..మహా భా రం కావడంతో... సంక్రాంతికి సకినాలు, అరిసెలు, మురుకులు తదితర పలహా రాలు చేసుకో వడానికి సామాన్య, మధ్యతర గతి కుటుంబాల వారు జంకుతున్నారు.
‘గ్యాస్’ ట్రబుల్.. కూర ‘గాయాలు’
ప్రస్తుతం వంట గ్యాస్ బుక్ చేసిన వారం రోజు ల వరకు గ్యాస్ రావడం లేదు. ఇళ్లలో వాడాల్సిన వంట గ్యాస్ సిలెండర్లు వ్యాపార సంస్థలకు తరలి పోతుండడంతో వంట గ్యాస్ కొరత తలెత్తుతుం ది. కూరగాయల ధరలు విపరీ తంగా పెరిగాయి. బీరకాయ, చిక్కుడుకాయ కిలోకు రూ.60, పచ్చి మిర్చి కిలోకు రూ.50 పలుకు తుంది. కోడి గుడ్డు ఒకటి రూ.7 నుండి రూ.8 వరకు ధర పలు కుతుం డడం సామా న్యుడిపై ధరాఘాతంగా మారింది.
పిండి వంటలు చేసుకోవాలంటేనే భయమేస్తుంది : చిట్యాల విజయ, గృహిణి, కోడూరు
నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ సారి సంక్రాంతి పండుగను ఘనంగా జరుుపుకోలేకపోతున్నాం.ఽ పప్పులు, నూనెలకు ధరలు పెరగడంతో పిండి వంటలు చేసుకోవాలంటేనే భయమేస్తుంది. ధరలు చూసిన తర్వాత పండుగ ఉత్సాహం నీరుగారిపోయింది. పెరిగిన ధరల వల్ల మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు పిండి వంటలు చేసుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ఏం కొనలేం.. ఏం తినలేం : రాజేశ్వరి, గృహిణి, రఘునాథపల్లి
సంక్రాంతి పండుగ వస్తుందంటే గతంలో ఎంతో సంబురపడేవాళ్లం.. ఈ సారి మాత్రం అలాంటి పండుగ ఉత్సాహం.. సంతోషం లేకుండా పోయింది. నిత్యావసర సరుకుల ధరలను చూసే సరికి చుక్కలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో ఏం కొనేటట్లు లేదు..ఏం తినేటట్లు లేదు. ఇప్పుడు మంచినూనె ధరలు కూడా మండుతున్నాయి. ధరల నియంత్రణపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించా లి. బజారుకు రూ.500 తీసుకెళ్తే 5 రకాల వస్తువులు కూడా రావడం లేదు.
Updated Date - Jan 08 , 2025 | 11:52 PM