రాజీవ్‌ యువ వికాసంపై అవగాహన కల్పించాలి

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:12 PM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకంపై ప్రజలకు అ వగాహన కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

రాజీవ్‌ యువ వికాసంపై అవగాహన కల్పించాలి
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకంపై ప్రజలకు అ వగాహన కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళ వారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రాజీవ్‌ యువ వికాస పథకంలో ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులు పరిశీలించి ఎ వరైనా ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు సమర్పిస్తే అట్టి వాటిని హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎంపీడీవో కా ర్యాలయానికి వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యద ర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు వేరు చేసి తదుపరి కార్యచరణ కు సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో సత్యనా రాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:12 PM