అట్టహాసంగా బీఎంఆర్ కప్ పోటీలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:16 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే, వీఎంఆర్ కప్పు క్రీడా పోటీలను ప్రారంభించారు.
ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
పోటీలకు హాజరైన 2,100 మంది క్రీడాకారులు
తాండూరు/యాలాల, జనవరి 8, (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే, వీఎంఆర్ కప్పు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు తాండూరు నియోజకవర్గానికి చెందిన మొత్తం 50జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 2100 విద్యార్థులు పాల్గొన్నారు. మొదట క్రీడాజ్యోతి వెలిగించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. గత పాలకులు తాండూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కనీసం నియోజకవర్గ స్థాయిలో పోటీలు పెట్టలేదని ఆరోపించారు. సంవత్సరంలోగా తాండూరులో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. నాలుగు రోజులపాటు కొనసాగే పోటీల్లో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా పాల్గొని విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కప్ ఆర్గనైజర్ సుధాకర్‌రెడ్డి, గౌతమి పాఠశాల కరస్పాండెంట్ మైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పరిమళ, ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ కొండల్‌రెడ్డి, నాయకులు సంగెం హన్మంతు, రవి.మురళి, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 12:16 AM