అడవి జంతువు దాడిలో లేగదూడ మృత్యువాత

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:40 PM

దోమ మండలంలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిబాబా పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన లేగ దూడపై శనివారం రాత్రి గుర్తు తెలియని అటవీ జంతువు దాడి చేయడంతో మృతి చెందింది.

అడవి జంతువు దాడిలో లేగదూడ మృత్యువాత

దోమ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దోమ మండలంలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిబాబా పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన లేగ దూడపై శనివారం రాత్రి గుర్తు తెలియని అటవీ జంతువు దాడి చేయడంతో మృతి చెందింది. ఆదివారం ఉదయం రైతు సాయిబాబా పశువుల పాకకు వెళ్లి చూడగా లేగ దూడ మృతి చెందింది. ఈ విషయంపై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించగా గుర్తు తెలియని అటవీ జంతువు లేగదూడపై దాడి చేసి ఉంటుందని తెలిపారు.

Updated Date - Feb 09 , 2025 | 11:40 PM