ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:14 AM

ఈనెల 26 నుంచి ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2.20కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపనలో మహేందర్‌రెడ్డి తదితరులు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో

రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఘట్‌కేసర్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఈనెల 26 నుంచి ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2.20కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడిపించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ప్రధానంగా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. ఇందులో ప్రధానమైనది ఆరు గ్యారెంటీల అమలు అని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని, నాయకులు మహేష్‌, బర్ల రాధాకృష్ణ, ముత్యాలు, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మేడబోయిన వెంకటేష్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజీ నిర్మించాలని వినతి

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 11వ వార్డుల్లో విస్తరించి ఉన్న బ్యూటీనెస్ట్‌ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తున్నదని, తక్షణమే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మురుగు నీరు రోడ్లపై పారుతుండటంతో దుర్వాసనతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు. బాల్‌రెడ్డి, వేణుగోపాల్‌, మాల్యానాయక్‌, భూక్యానాయక్‌, రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:14 AM