ఏడాదిలోగా మినీ స్టేడియం పనులు పూర్తి
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:17 AM
రాజకీయాలకతీతంగా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల అబివృద్ధికి సహకారం అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గులో మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చౌదరిగూడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకతీతంగా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల అబివృద్ధికి సహకారం అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గులో మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేపీఎల్ ప్రీమియర్ లీగ్ సీజన్-5 క్రికెట్ పోటీలను తెలంగాణ ఒలంపిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయని అన్నారు. పరిగి-షాద్‌నగర్ ఫోర్‌లేన్ రోడ్డు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజే్‌షపటేల్, వివిధ పార్టీల నాయకులు బోయ శంకర్, కేకే, రాములుగౌడ్, నరేందర్, రఘనాఽథ్‌గౌడ్, చంద్రశేఖర్, మల్లేష్ గౌడ్, యాదయ్య, రామకృష్ణ, వాసురీ, అర్జున్ పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
తలకొండపల్లి: మండల కేంద్రంలో తలకొండపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్-3 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీలను ప్రారంభించారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గీతా నర్సింహ, పీసీసీ సభ్యులు శ్రీనివా్‌సగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కాసు శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా, మండల నాయకులు అంజయ్య, రవీందర్ యాదవ్, అజీమ్, గుజ్జల మహేశ్, భగవాన్ రెడ్డి, డిగ్రీ కృష్ణ, నరేశ్, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
చేవెళ్ల: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని షాబాద్ సీఐ కాంతారెడ్డి, చేవెళ్ల ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించగా సీఐ ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 12:17 AM