వైభవంగా గూడెం సత్యదేవుడి కల్యాణం

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:44 PM

దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి పుణ్యక్షే త్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సత్యదే వుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు.

  వైభవంగా గూడెం సత్యదేవుడి కల్యాణం

తరలివచ్చిన భక్తజనం - గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం

దండేపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి పుణ్యక్షే త్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సత్యదే వుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి తిలకిం చారు. ముందుగా గుట్ట కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహం, రకరకాల పుష్పాలతో సన్నాయి వాయి ద్యాలతో ప్రధానలయం వరకు తీసుకవచ్చి ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచారనలతో పూజలు చే శారు. ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించా రు. ఆలయ ముఖ్య అర్చకులు రఘస్వామి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, భక్తు లు స్వామి వారికి పట్టువస్త్రాలు మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చారు. ప్రధానలయంలో స్వామి వారికి పుష్పలకరణ చేసిన అనంతరం కల్యాణ వేదిక వరకు కల్యాణ వేదిక వరకు తీసుకవచ్చి ప్రతిప్ఠించారు. అనంతరం వేదపండితుల అ భిరామచార్యులు, దుద్దిళ్ల నారాయణశర్మ, భరత్‌శర్మ మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ముఖ్యఅర్చకులు గోవర్ధన రఘస్వామి, అర్చకులు సంపత్‌స్వామి, సమక్షంలో స్వామి వారి కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్‌, వివిధ ప్రాం తాల ప్రజాప్రతినిధులు, నాయకులు, వేలాది మంది భక్తులు సత్యదేవుడి కల్యాణం తిలకించారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. దేవస్ధానం ఆధ్వర్యంలో పూలు పండ్లు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. కల్యాణం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకుట్టుకున్నాయి. దండే పల్లి ఎస్సై తైసోనోద్దీన్‌, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాటు చేశారు. .

Updated Date - Feb 09 , 2025 | 11:44 PM