‘ప్రత్యేక’ పాలన.. అస్తవ్యస్తం
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:46 PM
ప్రత్యే కాధికారుల పాలనలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గతే డాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేశారు. సంవత్సరకాలంగా జవాబుదారీ తనం లేక ప్ర జలు నానా అవస్థలు పడుతున్నారు.

-ప్రజలకు కరువైన జవాబుదారీ తనం
-సమస్యలు వినేవారు లేక ప్రజల అవస్థలు
-గ్రామ పంచాయతీల్లో కుంటుపడ్డ అభివృద్ధి
-’ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెలుగు చూసిన సమస్యలు
మంచిర్యాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రత్యే కాధికారుల పాలనలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గతే డాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేశారు. సంవత్సరకాలంగా జవాబుదారీ తనం లేక ప్ర జలు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో కనీసం పా రిశుధ్య పరిరక్షణ కూడా చేపట్టడం లేదంటే అతిశయోక్తికాదు. గత సం వత్సరం గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం ముగిసిన తరువాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు రోజువారీ కార్యకలాపా ల్లో అధికారులు బిజీగా ఉన్నారు. తమ దైనందిన విధులు నిర్వహించేం దుకే వారికి సమయం దొరకడంలేదు. పైగా పంచాయతీల బాధ్యతలు అధనంగా అప్పగించడంతో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయార నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ఆదివా రం గ్రామ పంచాయతీల విజిట్ నిర్వహించగా, సమస్యలపై ప్రజలు ఏకరువు పెట్టారు.
కంపుకొడుతున్న కాలనీలు..
చెన్నూరు : చెన్నూరు మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో ప్ర త్యేక అధికారుల పాలనలో పారి శుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిం ది. గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుం ది. దీంతో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. ఆస్నాద, గంగారాం, కొమ్మెర, చాకెపల్లి తదితర గ్రామాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా అధి కారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. వెంటనే పారిశుధ్య పనులతో పాటు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
బెల్లంపల్లిలో పడకేసిన ప్రత్యేక పాలన
బెల్లంపల్లి: మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నా యి. మండలంలోని గ్రామపంచాయతీలను ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. పంచాయతీల నిర్వహణ కు ఖర్చు విషయంలో ప్రత్యేకాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీం తో భారమంతా ఆయా గ్రామాల కార్యదర్శులపైనే పడుతోంది. దీంతో పా రిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. నర్సరీల సంరక్షణ సరిగ్గా జరగడం లేదు. అలాగే పలు గ్రామాల్లో వీధీ దీ పాలు కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
(తరువాయి 7లో)
Updated Date - Feb 09 , 2025 | 11:46 PM