Share News

జగిత్యాల పెద్దాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:51 AM

జగిత్యాల ప్రధానాసుప త్రిలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేషంట్‌ వీల్‌చైర్‌ లేకపోవడంతో తన తండ్రి సెలైన్‌ బాటిల్‌ పట్టుకోగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన ఘటన చర్చనీ యాంశంగా మారింది.

జగిత్యాల పెద్దాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం
జగిత్యాల ఆస్పత్రిలో చేతిలో సెలైన్‌ బాటిల్‌తో కొడును నడిపించుకు తీసుకెళ్తున్న తండ్రి

జగిత్యాల అర్బన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ప్రధానాసుప త్రిలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేషంట్‌ వీల్‌చైర్‌ లేకపోవడంతో తన తండ్రి సెలైన్‌ బాటిల్‌ పట్టుకోగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన ఘటన చర్చనీ యాంశంగా మారింది. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభిషేక్‌ అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్‌లో తండ్రి తోడురాగా జగిత్యాల ప్రధానాసుపత్రికి వచ్చాడు. అంబులెన్స్‌ దిగిన అతనికి వీల్‌ చైర్‌ లేక పోవడం, అక్కడ సమయానికి ఎవరూ రాకపోవడంతో తండ్రి సెలైన్‌ బాటిల్‌ పట్టుకోగా నడుచుకుంటూ ఆసుపత్రిలోనికి వెళ్లాడు. దీంతో పెద్దాసు పత్రిలో సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ పలువురు విమర్శించారు.

Updated Date - Apr 01 , 2025 | 12:51 AM